జెర్సీ మొదటి రోజు వసూళ్ళు ఇవే!

Sat Apr 20 2019 20:14:29 GMT+0530 (IST)

Jersey First Day collections

న్యాచురల్ స్టార్ నాని.. శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ' నిన్న శుక్రవారం విడుదలైంది.  ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత దాదాపు అందరినీ క్లీన్ బౌల్డ్ చేసేసింది. అటు ప్రేక్షకుల మౌత్ టాక్.. ఇటు రివ్యూల అభిప్రాయం అంతా పాజిటివ్ గా ఉండడంతో సినిమాను హిట్ దిశగా పయనించడం ఖాయమని అంటున్నారు.ఈ సినిమాకు సెలబ్రిటీల నుండి కూడా భారీ మద్దతు దక్కుతోంది. ఒకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు.. మరోవైపు ఇతర టాలీవుడ్ దర్శకులు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమర్షియల్ విషయాలు మాట్లాడుకుంటే ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించింది.  తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.88 కోట్ల రూపాయల షేర్ రాబట్టి స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసింది.  అసలే పాజిటివ్ టాక్.. నాని ఏమో ఫ్యామిలీలకు నచ్చే హీరో.. వీటికి తోడు సమ్మర్ సీజన్ కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

ప్రపంచవ్యాప్తంగా 'జెర్సీ' మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 1.94  cr

సీడెడ్: 0.41 cr

ఉత్తరాంధ్ర: 0.53 cr

కృష్ణ: 0.35 cr

గుంటూరు: 0.41 cr

ఈస్ట్ : 0.37 cr

వెస్ట్: 0.29 cr

నెల్లూరు: 0.18 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 4.48 cr

అమెరికా: 1.45 cr

కర్ణాటక: 0.55 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 0.40 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 6.88 cr