కొత్త లవర్ కు హీరోయిన్ టాటా.. పాత ప్రియుడిపైనే మోజు!

Thu May 13 2021 05:00:01 GMT+0530 (IST)

Jennifer Lopez Ben Affleck back together

సినిమా ఇండస్ట్రీలు ఎలాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తాయో.. అక్కడి నటీనటుల వ్యక్తిగత జీవితాలు కూడా అదేవిధంగా ఉండడం విశేషం. హాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పడక గది సన్నివేశాలు కూడా చాలా సింపుల్ గా తెరకెక్కుతుంటాయి. అదే మనదగ్గర బాలీవుడ్ కు వచ్చేసరికి వాటి తీవ్రత తగ్గుతుంది. ఘాటు రొమాన్స్ తో సినిమాలు రూపొందుతుంటాయి. ఇక టాలీవుడ్ వంటి ఇండస్ట్రీలకు వచ్చేసరికి రొమాన్స్ స్థాయికూడా ఇంకా తగ్గిపోతుంది.ఇక నటీనటుల వ్యక్తిగత జీవితాలు కూడా ఇండస్ట్రీని బట్టే ఉంటాయి. టాలీవుడ్ లో నటీనటుల లవ్ మ్యాటర్స్ చాలా తక్కువగానే ఉంటాయి. బ్రేకప్ లు కూడా చాలా తక్కువ. బాలీవుడ్ కు వెళ్లే సరికి పరిస్థితి మారిపోతుంది. అక్కడ లవర్ ను మెయింటెయిన్ చేయడమే స్టేటస్ గా భావిస్తుంటారు. అలా.. ప్రేమలు కామన్.. బ్రేకప్ లు కూడా కామనే. ఇదే విషయాన్ని హాలీవుడ్ కు అప్లై చేసినప్పుడు అది మరింత ఫాస్ట్. ఎవరు ఎప్పుడు ఎవరిని లవ్ చేస్తారో..? ఎన్నాళ్లు సహజీవనం చేస్తారో? ఎప్పుడు లవర్ ను స్టెఫినీ మాదిరిగా మార్చేస్తారో తెలియదు. అలాంటి కథల్లో ఒకటే ఇది.

హాలీవుడ్ హీరోయిన్ జెన్నీఫర్ లోపెజ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న జెన్నీ.. ప్రేమ విషయంలోనూ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమె అలెక్స్ రోడ్రిగ్స్ తో నాలుగేళ్లుగా సహజీనం చేస్తోంది. ఇద్దరిలో ఎవరికి బోర్ కొట్టిందో తెలియదుగానీ.. బ్రేకప్ టైమ్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం. అది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టు కూడా లేరు. కానీ.. జెన్నీఫర్ మాత్రం.. మరో బాయ్ ఫ్రెండ్ తో షికార్లు తిరిగేస్తోందట!

అతను ఎవరో కాదు.. తన పాత ప్రేమికుడే! రోడ్రిగ్స్ కన్నా ముందు బెన్ అప్లెక్స్ తో వ్యవహారం నడిపింది జెన్నీఫర్. వీరిద్దరూ నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2003లో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. ఏడాది తిరగక ముందే విడిపోయారు. ఇప్పుడు మరోసారి అతడితో కలిసి తిరుగుతోందట జెన్నీ. ఈ నెల 8న చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు మీడియా కంట పడడంతో.. వైరల్ అయ్యాయి.