నా నగ్న శరీరాన్ని చూడండి...!జెన్నీఫర్ లారెన్స్ హాట్ కామెంట్స్

Mon Nov 29 2021 13:51:45 GMT+0530 (IST)

Jennifer Lawrence sensational comments

‘నా న్యూడ్ బాడీని ఎవరైనా చూడొచ్చు..అందరికీ అందుబాటులోనే ఉంది..!’ అని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. 2014లో హాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్లకు చెందిన కొన్ని న్యూడ్ చిత్రాలు లీకయ్యాయి. కొంతమంది ఆకతాయిలు ఈ భామలకు చెందిన ఫొటోలను వారి మెయిల్స్ నుంచి తస్కరించి రిలీజ్ చేశారు.అయితే వీరు ఆ ఫొటోలను రిలీజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయాజనం పొందకపోయినా ఆ ఫొటోల వల్ల బాధిత హీరోయిన్లు మాత్రం మానసిక వేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా జెన్నీఫర్ లారెన్స్ తీవ్ర మానసిక వేదనకు గురవుతూ తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది.

‘నగ్న చిత్రాలను దొంగిలించడమంటే సెక్స్ క్రైమ్ కిందికి వస్తుంది. పర్సనల్ కు చెందిన ఇలాంటి ఫొటోలు దొంగిలించిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. అయితే కొందరు సెలబ్రెటీల న్యూడ్ పిక్స్ రిలీజ్ అయితే చూసి ఆనందిస్తున్నారని కానీ ఇలాంటి వాటికి వ్యతిరేకంగా గళం విప్పాలి.. అయితే నగ్న చిత్రాల్లో ఉండడం తప్పే.. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటాను’ అని జెన్నీఫర్ వెల్లడించింది.

అయితే కొందరు మాత్రం మీరు మాత్రం అలాంటి ఫొటోల్లో ఉండాల్సిన అవసరం ఏముంది..? ఆ ఫొటోలనే మీ మెయిల్స్ లో ఎందుకు ఉంచారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఇక అప్పటి నుంచి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని జెన్నీఫర్ ఇటీవల తెలిపింది. ముందుగా ఆమె మాట్లాడుతూ ‘2014లో జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ వేదనకు గురవుతున్నాను. వేర్వేరు సెలబ్రెటీలకు సంబంధించి 500 ఫొటోలను హాక్ చేశారు. ఫ్రాన్స్ కు చెందిన వారు ఈ ఫొటోలను లీక్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. సో.. నా అంగీకారం లేకుండా నా న్యూడ్ ఫొటోలను చూడొచ్చు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆప్పట్లో జరిగిన ఈ గాయం ఇప్పటికీ మానదు... అంటూ తెలిపింది.

ఇదే సందర్భంలో 2017లో జరిగిన మరో అనుభవం చెప్పింది. ‘ మా స్వస్థలం లూయిస్ విల్లే కెంటక్కీ నుంచి న్యూయార్క్ కు ఓ ప్రైవేట్ విమానం బయలు దేరింది. అప్పుడు విమానంలో రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. ఈ సమయంలో తాను చనిపోతామనే భావన కలిగింది. నా మొబైల్ లో నా అస్థిపంజరం సీటులో ఉండిపోనుంది.. నేను నా కుటుంబానికి వాయిస్ మెయిల్ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను.. నన్ను క్షమించండి..అని మెసేజ్ పెట్టాను ’అని జెన్నీఫర్ తెలిపింది.

ఇక జెన్నీఫర్ ‘డోంట్ లుక్ అప్’ అనే సినిమాతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా ఈమె ప్రమాదానికి గురైంది. షూటింగ్ లో భాగంగా భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు. ఈ క్రమంలో కిటికి అద్దం వచ్చి నెన్నీఫర్ కంటికి బలంగా తాకింది. దీంతో పెద్ద గాయం అయింది. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.

అయితే ఆ సమయంలో ఆమె క్షేమంగానే ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సైన్స్ అండ్ సెటైరికల్ థ్రిల్లింగ్ తో ఈ మూవీ రాబోతుంది. ఇందులో లియోనార్డో డికాప్రియో జెన్నీఫర్ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది డిసెంబర్ 10న విడుదల కాబోతుంది. అయిటే ఓటీటీ వేదికగా డిసెంబర్ 24 నుంచి రన్ కానుంది. ఈ మూవీకి ఆడమ్ మెక్కే దర్శకుడు.