'గరుడ వేగ' సీక్వెల్లో జీవితరాజశేఖర్ కుమార్తెలు

Sun Jun 07 2020 18:30:33 GMT+0530 (IST)

Jeevitha Rajasekhar's daughters in the Garuda Vega Sequel

జీవిత- రాజశేఖర్ కుమార్తెలు శివానీ- శివత్మిక కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. అక్క కంటే ముందే శివాత్మిక ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దొరసానిగా నటించి మెప్పించింది. శివానీ నటించిన తొలి సినిమా రకరకాల కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. సిస్టర్స్ ఇటీవల సోషల్ మీడియాలో యమ స్పీడ్ గానే ఉన్నారు. రెగ్యులర్ ఫోటోషూట్లతో హీట్ పెంచుతూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కా చెల్లెళ్ల కెరీర్ పై పేరెంట్ చాలా సీరియస్ గా ప్రణాళికల్ని వేస్తున్నారు.



త్వరలో శివానీ-శివాత్మిక కలిసి ఓ చిత్రంలో నటించనున్నారని సమాచారం. యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ మూవీ `గరుడ వేగ`కు సీక్వెల్ లో నటిస్తున్నారట. దర్శకుడు ప్రవీణ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రంలో సిస్టర్స్ కోసం దర్శకుడు స్పెషల్ రోల్స్ డిజైన్ చేశారని.. వారి హంగామా ఓ రేంజులోనే ఉంటుందని తెలిసింది.

బాలీవుడ్ హిట్ రొమాంటిక్ డ్రామా `2 స్టేట్స్` తెలుగు రీమేక్ ద్వారా శివానీ సినీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించినా కుదరలేదు. ఆ సినిమాని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మధ్యలోనే ఆపేశారు. అయినా శివానీ చాలా పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమా గరుడవేగ సీక్వెల్ లో నటించనుంది కాబట్టి అది తనకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. శివత్మిక గత సంవత్సరం దొరసాని చిత్రంలో నటించింది. ప్రస్తుతం కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న `రంగమార్తాండ`లో ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తోంది.