Begin typing your search above and press return to search.

నేను నా కోసం బ్రతుకుతాను .. ప్రపంచం కోసం కాదు: జీవిత

By:  Tupaki Desk   |   15 May 2022 11:30 PM GMT
నేను నా కోసం బ్రతుకుతాను .. ప్రపంచం కోసం కాదు: జీవిత
X
నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన జీవిత, ఆ తరువాత దర్శక నిర్మాతగా అనేక చిత్రాలు చేశారు. రాజశేఖర్ హీరోగా ఆమె 'శేఖర్' సినిమా చేశారు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ .. ' శేఖర్ ' కమర్షియల్ సినిమా .. ఈ సినిమాలో రాజశేఖర్ వైట్ హెయిర్ తో కనిపిస్తారు. ఆ గెటప్ ఆ సినిమాకి హీరో అనుకునేలా ఉంటుంది. కథ బాగా నచ్చడం వల్లనే రాజశేఖర్ ఆ గెటప్ తో కనిపించారు.

రాజశేఖర్ ఎప్పుడూ కూడా గ్లామర్ గానే కనిపించాలని ఏమీ అనుకోరు. బయట రకరకాలుగా వింటాం అంతే. అదే ప్రపంచం .. అదే సొసైటీ .. అదే సంఘం .. దానిని మనం ఏమీ అనలేం. ఏంటి? అంటేనే అది పక్క వీధిలోకి వెళ్లేసరికి వేరేలా వినిపిస్తుంది. రాజశేఖర్ ఎప్పుడూ కొత్తగా చేయాలనే అనుకుంటారు .. కొత్తగా కనిపించడానికే ప్రయత్నిస్తారు. మంచి అవకాశాలు రావాలేగానీ .. విలన్ గా చేయడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఆయనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం .. డిఫరెంట్ గెటప్స్ వేయడం ఇష్టం.

ఆయనకి నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తారు .. ఏదో చేసేద్దాం అన్నట్టుగా మాత్రం చేయరు. ఈ మధ్యలో ఓ పెద్ద సినిమా నుంచి విలన్ రోల్ వస్తే వదిలేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి అలాంటిదేం లేదు. లైన్ గా వినిపించినప్పుడు ఆయన కోసం అనుకున్న పాత్ర బాగా అనిపించింది. కథ పూర్తిగా రెడీ అయిన తరువాత ఆ పాత్ర తాను అనుకున్నంత లేదనిపించి నో చెప్పారు. రాజశేఖర్ తన కథల విషయంలో తనే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఆయన ఎవరి మాట వినిపించుకోరు. ఆయనకి బదులుగా నేను కథలు వింటాను .. ఆ తరువాత ఆయనకి చెబుతాను .

ఒక వేళ రాజశేఖర్ గారికి కథ నచ్చకపోతే .. అదే విషయాన్ని వచ్చిన వాళ్లకి చెబుతాను. దాంతో వాళ్లు బయటికి వెళ్లి 'రాజశేఖర్ వరకూ ఆవిడ వెళ్లనీయరు .. ఆయనను విననీయరు. అంతా ఆమెనే చూసుకుంటారని చెప్పుకుంటారు. రాజశేఖర్ గారు నో అనే మాటను ఆయనతోనే చెప్పించవచ్చుగదా? అని మీరు అంటున్నారు. అంత ఆవరసం ఏవుందని నేను అంటున్నాను. నేను నా కోసం బ్రతుకుతానే గానీ .. ఈ ప్రపంచం కోసం కాదు. నాకు ఏది కంఫర్టుగా అనిపిస్తుందో అదే చేస్తాను తప్ప .. ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి , వాళ్లు అనుకుంటున్నట్టుగా బ్రతికే పద్ధతే లేదు" అంటూ చెప్పుకొచ్చారు.