సహజ నటి సడెన్ షాకిచ్చారిలా..!

Wed Nov 24 2021 16:00:01 GMT+0530 (IST)

Jayasudha has now completely changed

తనదైన అందం సహజ నటనతో దశాబ్ధాల పాటు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారు జయసుధ (62). పరిశ్రమ అగ్రకథానాయకుల సరసన నటించిన జయసుధ ఇటీవలి కాలంలో సహాయ నటిగానూ గొప్ప నటప్రదర్శనతో మెప్పించారు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగానూ జయసుధ సేవలందించారు.మొన్న మా అసోసియేషన్ ఎన్నికల 2021 వేళ జయసుధ కూడా పోటీకి దిగుతారని ప్రచారమైంది. అయితే సడెన్ గా సహజనటి ఎందుకనో మీడియా గ్లేర్ నుంచి దూరమయ్యారు.

ఇప్పుడు అంతే సర్ ప్రైజింగ్ గా సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమయ్యారిలా. జయసుధ రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆ ముఖంలో మునుపటి ఛామ్ కనిపించడం లేదు. బహుశా వయసు సంబంధిత సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారని అర్థమవుతోంది. దానికి తగ్గట్టే ఫిలింనగర్ లోనూ ఈ తరహా గుసగుసలు వినిపించాయి.

అనారోగ్యానికి చికిత్స కోసం జయసుధ విదేశాలకు వెళ్లారని.. చికిత్స అనంతరం తిరిగి హైదరాబాద్ కి వస్తున్నారని ప్రచారమైంది. కానీ దేనికీ అధికారికంగా క్లారిటీ లేదు. తాజాగా జయసుధ సడెన్ గా ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. తన ఫోటోకి ``స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ`` అన్న క్యాప్షన్ ని ఇచ్చారు.

ఈ ఫోటో చూడగానే పలువురు జయసుధ ఆరోగ్యం ఎలా ఉందోనంటూ ఆందోళన చెందారు.. ఆరాలు తీసారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఈ సామాజిక మాధ్యాలలో ఎందరో... ఎన్నో రకాలుగా ఆరోగ్యం ఆహార్యం మీద పెడుతున్న.. రాస్తున్న వార్తలకు తెర దించుతూ పూర్తి ఆరోగ్యం అదే సహజమైన చిరునవ్వుతో మీరు మీ చిత్రాన్ని పంచుకోవడం సంతోషకరం.

మీ చెరగని చిరునవ్వుతో మీ సహజ నటనతో మళ్లీ సినిమాలో కనిపిస్తారని ఆశిస్తూ...అంటూ ఓ అభిమాని నమస్కారం ఈమోజీని షేర్ చేశారు.

మీరు మా అమ్మతో సమానం.. ఆరోగ్యంగా ఉండాలి. మళ్లీ నటించాలి..! అంటూ మరో అభిమాని కోరుకున్నారు. తెలుగుతో పాటు హిందీ- తమిళ్- కన్నడ సినిమాల్లో జయసుధ నటించారు. అమ్మ అక్క పాత్రలు అంటే జయసుధ గుర్తుకు వస్తారు.

మళ్లీ ఈ సహజనటి వెండితెరపై అలరించేందుకు వస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు. తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ జయసుధ అధికారికంగా మీడియాకి సమాచారం ఇస్తారేమో చూడాలి.