Begin typing your search above and press return to search.

‘జయ జయ మహావీర’ సాంగ్: ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ కోసం రీమిక్స్ చేసిన రఘువీర గద్యం

By:  Tupaki Desk   |   15 Jun 2021 7:49 AM GMT
‘జయ జయ మహావీర’ సాంగ్: ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ కోసం రీమిక్స్ చేసిన రఘువీర గద్యం
X
కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌ బాబు హీరోగా నటిస్తున్న దేశభక్తి చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్ ర‌త్న‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మోహ‌న్‌ బాబు స్క్రీన్‌ ప్లే స‌మ‌కూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి ‘జయ జయ మహావీర’ అనే మొదటి పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

‘జయ జయ మహావీర మహాధీర ధౌరేయా.. దేవాసుర సమర సమయ సముధిత నిఖిల నిజర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా..’ అంటూ సాగే ఈ పాటని యువ గాయకుడు రాహుల్‌ నంబియార్‌ ఆలపించారు. దీనికి లెజెండరీ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా బాణీలు సమకూర్చారు. శ్రీరాముడి ఘనతను చాటిచెప్పే 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు ఇళయరాజా.

‘జయ జయ మహావీర’ పాటను బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి ''భారతీయ సినీ పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు మోహన్ బాబు - ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని పాట ఈ ‘జయ జయ మహావీర’. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొన్నారు.

కాగా, 'సన్‌ ఆఫ్‌ ఇండియా' చిత్రానికి స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గౌతంరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సుద్దాల అశోక్‌ తేజ పాట‌లు రాస్తుండ‌గా.. డైమండ్ ర‌త్న‌బాబు మరియు తోట‌ప‌ల్లి సాయినాథ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ - ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ళ భరణి - ఆలీ - వెన్నెల కిషోర్ - పృథ్వీరాజ్ - రాజా రవీంద్ర - రఘుబాబు - రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.