Begin typing your search above and press return to search.

హీరోయిన్ కాదు.. స్పోర్ట్ ప్రెజెంట‌ర్ తో క్రికెట‌ర్ పెళ్లి?

By:  Tupaki Desk   |   6 March 2021 4:30 AM GMT
హీరోయిన్ కాదు.. స్పోర్ట్ ప్రెజెంట‌ర్ తో క్రికెట‌ర్ పెళ్లి?
X
గ‌త కొంత‌కాలంగా టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా పేరు సినీస‌ర్కిల్స్ లో ప్ర‌ముఖంగా వినిపించింది. ఓ క్యూట్ మ‌ల‌యాళ హీరోయిన్ తో డీప్ గా ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని.. అతడంటే ఆ క్యూటీ కూడా విప‌రీతంగా ఇష్ట‌ప‌డుతోంద‌ని ప్ర‌చార‌మైంది. అంతేకాదు.. తొంద‌ర్లోనే ఈ జోడీ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని కాస్త అడ్వాన్స్ డ్ గానే క‌థ‌నాలు వండి వార్చారు. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాలా? .. క్యూట్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించే ఇదంతా.

అయితే ఇప్పుడు అనూహ్యంగా అనుప‌మ‌కే షాక్ తినిపిస్తూ బుమ్రా వేరొక భామ‌ను పెళ్లాడేయ‌బోతున్నాడ‌న్న పుకార్ వేడెక్కిస్తోంది. అత‌డు పెళ్లాడ‌బోయేది అనుప‌మ‌ను కాదు.. సంజన గణేశన్ అనే ఓ స్పోర్ట్స్ ప్రెజెంటర్ ని అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ పేరు ఇంత‌కుముందే వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా తెర‌పైకి రావ‌డంతో అంతా ఖంగు తిన్నారు.

ఈ వివాహం కోస‌మే అత‌డు ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో ఆడ‌కుండా సెల‌వు తీసుకున్నాడ‌ని అత‌డు ఇంటికి వెళ్లాడ‌ని ప్ర‌చార‌మైంది. అయితే బుమ్రా ఇంత‌కీ ఎవ‌రిని పెళ్లాడ‌బోతున్నాడో చెబుతాడా లేదా? అని అభిమానులంతా వేచి చూస్తున్నారు. అత‌డు పెళ్లాడేది అనుపమనా లేదా సంజననా? అంటూ ముచ్చ‌ట సాగుతోంది. మ‌రోవైపు అందాల రాశీఖ‌న్నాతోనూ బుమ్రా స్నేహం గురించి ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల గాసిప్పులు వినిపించాయి. అయితే బుమ్రాతో త‌న‌కు ఎలాంటి స్నేహం లేద‌ని రాశీ వెల్ల‌డించారు.