Begin typing your search above and press return to search.

వీర రాఘవుడితో జానీ చిందులు

By:  Tupaki Desk   |   26 Sep 2018 9:08 AM GMT
వీర రాఘవుడితో జానీ చిందులు
X
విడుదలకు మరో రెండు వారాలు మాత్రమే ఉండటంతో అరవింద సమేత వీర రాఘవపై అంచనాల మీటర్ పైపైకి ఎగబాకుతోంది. ఆడియోలో ఉన్నది నాలుగే పాటలు కావడం అభిమానులను కొంత అసంతృప్తికి గురి చేసినప్పటికీ వాటికి స్పందన బాగుండటం ఆనందంలో ముంచెత్తుతోంది. తాజాగా డాన్స్ మాస్టర్ జానీ చేసిన ట్వీట్ దాన్ని రెట్టింపు చేస్తోంది. మైండ్ పోయే స్టెప్స్ తో అదరగొట్టే జానీ ఆయా హీరోల బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కంపోజ్ చేయడంలో అద్భుతమైన నైపుణ్యం చూపిస్తాడు. చిరంజీవి అయినా చరణ్ అయినా అల్లు అర్జున్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఎక్కడా పోలిక రాకుండా ఫ్యాన్స్ తో ఈలలేయించడంలో ఈయనకు ఈయనే సాటి.

అందుకే రెడ్డి ఇటు చూడు అంటూ ఆల్బమ్ లో చివరిగా వచ్చే పాటకు దుమ్మురేపే స్టెప్స్ తారక్ తో చేయించి ఉంటాడు అనే అంచనాలో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలం తర్వాత తారక్ తో త్రివిక్రమ్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కిందన్న జానీ మాస్టర్ సినిమా మొత్తం ఇప్పటి దాకా కన్ఫర్మ్ చేసిన మాస్ సాంగ్ ఇదొక్కటే కాబట్టి హైప్ ను అందుకోవాలంటే మాములు స్టెప్స్ వేయిస్తే సరిపోదు. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కూడా ఈ షూట్ లో పాల్గొంది.

అక్టోబర్ 11న విడుదల కానున్న అరవింద సమేత వీర రాఘవను కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీర రాఘవ రెడ్డిగా తారక్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. టీజర్ తోనే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించిన త్రివిక్రమ్ త్వరలో ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెంచేయబోతున్నాడు. మరో వారం లో సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈసారి అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు ఉండే అవకాశం గురించి అప్పుడే వార్తలు వస్తున్నాయి. ఏడాది తర్వాత వస్తున్న తారక్ మూవీగా హైప్ ఈ రేంజ్ లో ఉండటం సహజమే.