పూల్ లో బికినీ అందాలతో సెగలు పుట్టిస్తోంది

Thu Jan 20 2022 18:08:01 GMT+0530 (IST)

Janvi Splendid Show In Black

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్.  మరాఠీ సంచలన చిత్రం `సైరట్` రీమేక్ ఆధారంగా రూపొందిన `ధడక్`తో నటిగా తన కెరీర్ ని ప్రారంభించింది. అయితే శ్రీదేవి క్రేజ్ కు తగ్గట్టుగా జాన్వీ పాపులారిటీని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. స్టార్ కిడ్ గా తెరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేకతని చాటుకునే ప్రయత్నంలో కొంత వెనకబడిందనే చెప్పాలి. నటిగా మంచి మార్కులు దక్కించుకున్న జాన్వీ .. తన మదర్ శ్రీదేవి స్థాయిలో మాత్రం మేకర్స్‌ని ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయలేకపోతోంది.ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిందేమో వరుస ఫొటో షూట్ లు బికీనీ ట్రీట్ తో సోషల్ మీడియాని హీటెక్కించేయడం మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా తనలోని స్పైసీ యాంగిల్ ని చూపిస్తూ యువతరానికి కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా బికినీ ధరించి పూల్ సైడ్ కూర్చుని అందాల విందు చేస్తూ తడిసిన అందాలతో కవ్విస్తోంది.

తాజాగా బ్లాక్ బికినీ ధరించి తడిసిన అందాలతో కనువిందు చేస్తున్న తన ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటొలు నెట్టింట వైరల్ అవుతూ ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలకు యుడైమోనియా` అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ ఫొటోలు చూసిన వారంతా ఆలస్యంగానైనా జాన్వీ మేలుకుందని అసలు విషయం తెలుసుకుని ఎట్రాక్ట్ చేయడం ప్రారంభించిందని నెటిజన్ లు సినీ వర్గాలు కామెంట్ లు చేస్తున్నారు.

24 ఏళ్ల జాన్వీ కపూర్ ఎల్లో కలర్ బికినీ ఫొటోలని ఇటీవల అభిమానులతో పంచుకుంది. తాజాగా బ్లాక్ కలర్ బికినీ లో దర్శనమిచ్చి మరింతగా హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తోంది. అల్ట్రా గ్లామర్ డాల్ గా మారిపోయిన జాన్వీ కపూర్ `రూహి` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజ్ కుమార్ రావు వరుణ్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ మేవీగా రూపొందిన ఈ మూవీ జాన్వీకి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం `దోస్తానా -2` గుడ్ లక్ జెర్రీ మిలి చిత్రాల్లో నటిస్తోంది.