Begin typing your search above and press return to search.

ఫోర్క్ తో జాన్వీ మ‌ర్డ‌ర్ ఇంట్రెస్టింగ్!

By:  Tupaki Desk   |   28 May 2022 3:32 PM GMT
ఫోర్క్ తో జాన్వీ మ‌ర్డ‌ర్ ఇంట్రెస్టింగ్!
X
ఫోర్క్ తో జాన్వీ క‌పూర్ మ‌ర్డ‌ర్. అవును మీరు వింటుదున్న‌ది నిజ‌మే. జాన్వీ ఫోర్క్ ని చేతిలోకి తీసుకుని ప‌రుగున వ‌చ్చి మ‌రీ మ‌ర్డ‌ర్ చేసింది. మ‌రి జాన్వీ చేతిలో హ‌త్య‌కు గురైంది? ఎవ‌రంటే? బేక‌రీలో బ‌న్ అని తెలుస్తుంది. అవును బ‌న్ ని జాన్వీ మామ‌లుగా పొడిచి తిన‌లేదు. ప‌రిగెట్టుకుంటూ వ‌చ్చి క‌సితో బ‌న్ ని పొడిచి ఆ పీస్ ని అమాంతం నోట్లో పెట్టుకుని గుట‌కేసింది.

దానికి సంబంధించిన వీడియో ని ఇన్ స్టా రీల్స్ ద్వారా అభిమానుల‌కు చేర వేసింది. మిరుమిట్లు గొలిపే డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ ఈ సాహ‌సానికి తెగ‌బ‌డింది.

కెమెరాకి ఫోజులిస్తూ డిన్న‌ర్ టైమ్ అంటూ చెప్ప‌గానే జాన్వీ న‌వ్వుకుంటూ ప‌రుగున వెళ్లి బ‌న్ పై దాడికి దిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

జాన్వీ ని అలా చూసి ఈ అల్ల‌రి ప‌నులేంటి? అంటూ ఫ‌న్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అప్పుడ‌ప్పుడు ఇలాంటి స‌ర‌దా వీడియోలు జాన్వీకి కొత్తేం కాదు. ఇన్ స్టా రీల్స్ చేస్తూ అభిమానుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తుంది. డైలీ లైఫ్ లో షూటింగ్ ఇత‌ర ప‌నుల‌తో అలిసి పోయిన బ్యూటీలు ఇలా చిల్ అవుతూ ఫ్యాన్స్ లో సైతం జోష్ నింపుతుంటారు.

చెల్లెలు ఖషీ క‌పూర్ కూడా కొన్ని సంద‌ర్భాల్లో అక్క‌తో జ‌త కలుస్తుంటుంది. అక్కా-చెల్లి క‌లిసారంటే మ‌రింత ఫ‌న్ యాడ్ అయిన‌ట్లే.

ఇక జాన్వీ కెరీర్ విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో న‌టిగా బిజీగా ఉంది. ఇప్ప‌టికే 'గుడ్ ల‌క్ జెరీ'..'మిలి' చీత్రాల షూటింగ్ పూర్తిచేసింది. ప్ర‌స్తుతం ఆ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

అలాగే 'బ‌వాల్' అనే కొత్త ప్రాజెక్ట్ కి ఒకే చెప్పింది. ఇంకా క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో మ‌రో రెండు సినిమాల‌కు సైతం ఇటీవ‌లే సైన్ చేసింది. త్వ‌ర‌లోనే ఆ చిత్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర రూమ‌ర్ వైర‌ల్ అవుతూనే ఉంది. కానీ ఎంట్రీ ఎప్పుడ‌న్న‌ది అధికారిక క్లారిటీ రావ‌డం లేదు.