గుసగుస: మహేష్ సరసన జాన్వీ కపూర్?

Mon May 03 2021 10:00:01 GMT+0530 (IST)

Janhvi kapoor in mahesh babu movie

ప్రతిసారీ రొటీన్ హీరోయిన్లతో మన స్టార్ హీరోలు విసిగివేసారిపోయారు. అయితే పూజా హెగ్డే లేదంటే కియరా అద్వాణీ కుదరకపోతే రష్మిక మందన పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురూ ఇప్పటికే మహేష్ సరసన కథానాయికలుగా నటించేశారు.కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో కియరా నటించగా.. పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక కథానాయిక. మహేష్ ఆ ముగ్గురితో ఇప్పటికే రొమాన్స్ చేసేశారు కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం మరో కొత్త కథానాయికను తీసుకునే ఆలోచన నిర్మాతలకు వచ్చిందట. ఇప్పటికే జాన్వీ కపూర్ ని తెలుగు తెరకు పరిచయం చేయాలని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రయత్నాల్లో ఉంది. జాన్వీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తే వెంటనే లాంచ్ చేయడమే.

మహేష్ లాంటి అగ్ర హీరో సరసన అవకాశాన్ని బోనీకపూర్ కూడా ఎంకరేజ్ చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. చరణ్ లేదా మహేష్ ఎవరో ఒకరితో జాన్వీ లాంచింగ్ కూడా అదిరిపోతుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ప్రస్తుతానికి  బుట్ట బొమ్మ పూజా హెగ్డే వైపు త్రివిక్రమ్ చూపు ఉందిట. కియరా మరోవైపు ఎన్టీఆర్ - కొరటాల చిత్రానికి లాక్ అయ్యింది. కానీ తనకు కూడా త్రివిక్రమ్ తో ఆప్షన్ ఉంది. ఆ ఇద్దరి కంటే జాన్వీ కపూర్ ని పరిచయం చేయడం తెలుగు ఆడియెన్ ని మహేష్ అభిమానుల్ని ఎగ్జయిట్ చేస్తుందనడంలో సందేహమేం లేదు. బాలీవుడ్ లో నెమ్మదిగా గ్రాఫ్ పెంచుకోవడంలో సక్సెసైనా జాన్వీ డెబ్యూ కోసం తెలుగు ఆడియెన్ వెయిటింగ్. ఇంతకీ మహేష్ సరసన జాక్ పాట్ కొట్టే నాయిక ఎవరు? అన్నది వేచి చూడాలి.