డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన నటవారసురాలు!

Sun May 09 2021 21:00:01 GMT+0530 (IST)

Janhvi also said that she has become an doctor

డాక్టర్లు కాబోయి యాక్టర్ అయిన సెలబ్రిటీల జాబితా తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ ఇలాంటి వాళ్లున్నారు. నేడు స్టార్ హీరోలుగా ఉన్నవాళ్లు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా ఎందరో. అవకాశం చిక్కినప్పుడు ఎవరికి వారు వాళ్లు చదివిన చదువులు...ప్రస్తుత వృత్తుల్ని సరిపొల్చుతూ చేసే వ్యాఖ్యానాలు గమ్మత్తుగా ఉంటాయి. డాక్టర్ చదివి పార్ట్ టైమ్ గా సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వారు కొందరుంటే.. డాక్టర్ కోర్సు పేరుతో ఇంట్లో అబద్దాలు చెప్పి స్టార్లు అయిన వారు ఉన్నారు.తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కూడా డాక్టర్ కాబోయ్ యాక్టరయ్యిందని తెలిపింది. ముందుగా శ్రీదేవి తనను డాక్టర్ చదివించాలనుకుందిట. అయితే జాన్వీ తల్లి అభిరుచిని గమనించి డాక్టర్ చదువు తన వల్ల కాదంటూ ముందే చెప్పేసింది. తన నాలెడ్జ్ ని తెలివి తేటల్ని ముందే బేరీజు వేసుకుని వైద్య విద్యను అభ్యసించడం తన వల్ల కాదంటూ తల్లికి తెగేసి చెప్పేసిందిట. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికను జాన్వీ బయట పెట్టింది. దీంతో కుమార్తె కోరిక మేరకు సినిమాలకు ఓకే చెప్పారట.

చిన్న నాటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోయినట్లు జాన్వీ తెలిపింది. అదే చదువుల ఫ్యామిలీ అయితే ఆ రకంగానే జీవితం ఉండేదేమోనని సందేహం వ్యక్తం చేసింది. జాన్వీ మంచి పనే చేసింది. కేవలం డాక్టర్ గా సేవలందిస్తే ఆ సేవలు పరిమితం..కానీ తన అందాలు వెండి తెరపై విరజిమ్మేవి కావు. మెడలో స్టెతస్క్ స్కోప్ తో తెల్ల కోటేసుకుని చివరికి రంగుల ప్రపంచానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. `ధడక్` చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.