ఫోటో స్టోరి: పొట్టి ఫ్రాకులో థై బ్యూటీ హొయలు

Sun Sep 15 2019 10:25:59 GMT+0530 (IST)

Janhvi Kapoor looks pretty as a peach in blue wrap dress

చిట్టి పొట్టి నిక్కరులో.. థై సౌందర్యాన్ని విందుకు పెట్టి.. కుర్రకారును గగ్గోలు పెట్టించడం ముంబై బ్యూటీస్ కి కొత్తేమీ కాదు. చుట్టూ కళ్లన్నీ తమపైనే ఉండాలన్నది ఫేజ్ 3 రూల్. ఈ నియమాన్ని తూ.చ తప్పక ఆచరించడంలో నటవారసురాలు జాన్వీ నాలుగు ఆకులు ఎక్కువే తింది. తాను ఏం చేసినా జనాల అటెన్షన్ తనవైపు తిప్పేసుకోవడం అలవాటు. ఇంతకుముందు అసలు బాటమ్ లో చిట్టి పొట్టి నిక్కరు ఉందో లేదో కూడా సందేహించేలా ఆన్ స్ట్రీట్ కన్ఫ్యూజ్ చేసిన జాన్వీ.. తాజాగా మరోసారి చిట్టి పొట్టి ఫ్రాకులో అదిరిపోయే ట్రీటిచ్చింది.ఇటీవలే పై చదువుల కోసం.. పనిలోపనిగా నట శిక్షణ కోసం చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్ అమెరికా వెళుతుంటే సెండాఫ్ నోట్ తో జాన్వీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అక్కడ చెల్లెలుకి అంతా బాగుండాలని కోరుకుంది. అంతకుముందు సింగపూర్ లో మామ్ శ్రీదేవి మైనపు విగ్రహాన్ని కపూర్ ఫ్యామిలీ లాంచ్ చేసినప్పుడు ఆ వేదికపై జాన్వీనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత `గుంజన్ సక్సేనా-  కార్గిల్ గర్ల్` పోస్టర్ ని లాంచ్ చేసినపుడు తనపైనే కళ్లన్నీ. గుంజన్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించే ముందు వీకెండ్ లో పైలెట్ శిక్షణకు వెళ్లింది. ఇదంతా జాన్వీ బిజీ లైఫ్ లో ఒక కోణం అనుకుంటే.. మరో కోణంలో జాన్వీ ఎప్పుడూ నిరంతరం వేడెక్కించే వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఇటీవల జాన్వీ వీకెండ్స్ లో పైలెట్ క్లాసులతో బిజీగా ఉంది. అలా ఓసారి క్లాస్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతూ ఇదిగో ఇలా కనిపించింది. లైట్ బులుగు స్ట్రిప్డ్ డ్రెస్ లో తళుక్కుమంది. ఆ థైస్ అందాల్ని ఎలివేట్ చేసేలా ఆ డ్రెస్ లో ఏదో సంథింగ్ యూత్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. సెలబ్రిటీలు ఏం చేస్తున్నా వెంటాడడం మీడియా నైజం. అప్పటికే బయట చకోరపక్షుల్లా పడిగాపులు పడే ఫోటోగ్రాఫరలకు హాయ్ చెప్పి అలా కారెక్కి వెళ్లిపోయింది జాన్వీ. ఫోటోగ్రాఫర్లు దొరికిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇలా ఫోటోల్ని క్లిక్ మనిపించారు.