Begin typing your search above and press return to search.

కపూర్ బ్యూటీ సౌత్ సినిమాలకు రెడీ అవుతోందా..?

By:  Tupaki Desk   |   7 May 2021 12:30 PM GMT
కపూర్ బ్యూటీ సౌత్ సినిమాలకు రెడీ అవుతోందా..?
X
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్.. గురించి సౌత్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సుపరిచితమే. దడక్ మూవీతో కెరీర్ ప్రారంభించిన జాన్వీ రోజురోజుకి క్రేజ్ పెంచుకుంటూనే ఉంది. మొదటి సినిమా డీసెంట్ హిట్ కావడంతో జాన్వీకి మూవీ ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అప్పటినుండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

అయితే అమ్మడికి ఇండస్ట్రీలో పోటీ వాతావరణం బాగా నచ్చిందట. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు సౌత్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేద్దామా.. అంటూ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే జాన్వీ టాలీవుడ్ నుండి పలు అవకాశాలు రిజెక్ట్ చేసిందట. కానీ ఇప్పుడు జాన్వీ మనసు మార్చుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్యపాండే పాన్ ఇండియా మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేస్తోంది. తండ్రి బోణికపూర్ బడా నిర్మాతగా సౌత్ సినిమాలు చేస్తున్నారు. ఆయన కూడా కూతురును సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు.

కానీ ఇంతవరకు కుదరలేదు. ఎందుకంటే జాన్వీ పూర్తిగా బాలీవుడ్ సినిమాలే ఓకే చేసి లైన్ లో పెట్టుకుంది. ఇప్పుడు మెల్లగా జాన్వీ ఇంటరెస్ట్ తెలుగు సినిమాలపై పడిందట. అందుకే త్వరలో తెలుగు సినిమాల్లో మెరిసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా జాన్వీ ఇండస్ట్రీలో పోటీ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఎవరైనా అడ్జెస్ట్ అవ్వగలరని నేను నమ్ముతున్నాను. సినిమాలు అనేవి జీవితంలో ఒక భాగం. పోటికంటే నటించిన చిత్రానికి ఉత్తమంగా ఏం ఇచ్చాము.. మనం కోరుకున్న విధంగా సినిమా వచ్చిందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో పోటీ అనేది ఆరోగ్యంగానే ఉంది' అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. ఇటీవలే రూహి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తక్త్ - దోస్తానా 2 సినిమాలు చేస్తోంది.