ఫోటో స్టొరీ: జివ్వనిపిస్తున్న జూనియర్ శ్రీదేవి

Sun Dec 08 2019 13:30:06 GMT+0530 (IST)

Janhvi Kapoor Sizzles in Saree

ఈ తరంలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ హంగామా కాస్త ఎక్కువగానే ఉంది.  ముఖ్యంగా హీరోయిన్ల జోరు మామూలుగా లేదు.  ఈ స్టార్ కిడ్స్ లో జాన్వికి క్రేజ్ కాస్త ఎక్కువే. అతిలోకసుందరి శ్రీదేవికి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి. మొదటి సినిమా 'ధడక్' తో పాస్ మార్కుకు తెచ్చుకున్న జాన్వి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది.  నెక్స్ట్ జెనరేషన్ భామ కావడంతో సోషల్ మీడియాను షేక్ చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య.  జాన్విలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే డ్రెస్సింగ్.  సందర్భానికి తగ్గట్టు డ్రెస్ ధరించి చూపరులను చిత్తు చేస్తుంది. ఫిల్మీ ఈవెంట్లకు ఒకరకంగా తయారైతే.. ఫ్రెండ్స్ తో చిల్ అవుట్లకు మరో రకంగా రెడీ అవుతుంది. ఇక జాన్వి జిమ్ము డ్రెస్సుల గురించి చెప్పాలంటే ఒక పెద్ద బుక్కు రాయాలి. 'జిమ్ము డ్రెస్సుల పాప జిల్ జిల్ పాలకోవా' అనే టైటిల్ కూడా పెట్టాలి.  ఇదిలా ఉంటే రీసెంట్ గా జాన్వి ఒక చీరలో ఫోటో షూట్ చేసింది. చిట్టి పొట్టి జిమ్ము డ్రెస్సుల రాగం తాళం వేరు..  ఈ చీర బ్లౌజుల పల్లవి చరణం వేరు. వంగపండు రంగు చీర.. స్లీవ్ లెస్ బ్లౌజు.. వేలాడే చెవికమ్మలతో చిరునవ్వు రువ్వుతూ ఫోటోకు పోజిచ్చింది. నాభి అందాలను వడ్డించకుండానే నభూతో నభవిష్యతి తరహాలో నాజూకుగా కనిపించింది.  

ఇలాంటి ఫోటోలకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోతుంది.  లైకులు.. షేర్లతో నెటిజన్లు హోరెత్తించారు.  ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.