ఆ ఇద్దరికీ అన్నీ తానే అయిన కుర్రబ్యూటీ

Tue Jun 02 2020 09:15:05 GMT+0530 (IST)

Janhvi Kapoor Shares A Glimpse Of Her Quarantine With A Candid

స్వీయనిర్భంధన సమయం ఎన్నో ఆసక్తికర విషయాల్ని బయటపెడుతోంది. దాదాపు 2 నెలల పాటు దేశంలో నిర్భంధన సన్నివేశం చూస్తున్నదే. వినోదపరిశ్రమలకు లాక్ వేయడంతో స్టార్లంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. షూటింగుల్లేవ్.. థియేటర్లలో సినిమాల్లేవ్.. బయట తిరగడానికి అడ్డంకులెన్నో. అయితే ఇదే సమయంలో అసలు తామేంటో తెలుసుకుంటున్నారు. ఇంట్లోవాళ్లతో తమ అనుబంధం ఎలాంటిది?  ఎవరిపై ఎంత ప్రేమ ఉంది? అన్నది కూడా కనిపెట్టేస్తున్నారు.తాజాగా జాన్వీ చెప్పిన ఓ సంగతి ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండడంతో తన తండ్రి బోనీకపూర్ .. చెల్లెలు ఖుషీ కపూర్ పూర్తిగా తనపైనే ఆధారపడిపోయారట. తమకు ఏం కావాలన్నా తననే అడిగేస్తూ ఉండేవారట. అసలు నాన్న- చెల్లి ఇలా నాపైనే ఆధారపడతారని.. నాకు ఇంత బాధ్యత ఉందని ఇప్పుడే తెలిసిందని చెప్పింది జాన్వీ. అల్లరిగా ఆకతాయిగా ఉండే చిన్న పిల్ల మనస్తత్వం నాది. కానీ ఇంత పెద్ద బాధ్యత బరువు ఉన్నాయని తెలిసింది ఇప్పుడే అంటూ కాస్త కంగారుగానే చెప్పింది.

కూరగాయలు కొనడం నుంచి వాటిని శుభ్రంగా కడిగారా లేదా? కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా? అన్న విషయాల్ని జాన్వీ తనే స్వయంగా పర్యవేక్షించిందట. ఇంకా ఇంట్లో ప్రతిదీ తాను పట్టించుకునేది. మామ్ శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత ఆ కుటుంబం ఒక రకంగా డీప్ క్రైసిస్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత జాన్వీలోనే శ్రీదేవిని చూసుకుంటున్నారు బోనీ. అలాగే అమ్మ మరణంతో కుంగిపోయిన సోదరి ఖుషీ సైతం అక్కలోనే మామ్ ని చూసుకుంటోందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే జాన్వీ తన బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతో తెలివిగా కెరీర్ బండిని సాగిస్తోంది. కాలం ఎన్నిటికో సమాధానాలిస్తున్నా.. ఇంకా శ్రీదేవి డెత్ మిస్టరీపై అభిమానుల్లో సందేహాలు మాత్రం వదల్లేదు ఎందుకనో!