ఫోటో స్టోరి: అతిలోక సుందరి దిగొచ్చిందా?

Fri Jul 30 2021 15:10:46 GMT+0530 (IST)

Janhvi Kapoor Poses In A Trendy Outfit

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ బాలీవుడ్ లో ఫ్యాషనిస్టాగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు నవతరం కథానాయికల్లో పెద్ద స్టార్ గా ఎదిగేస్తున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటో షూట్లతో హాట్ కంటెంట్ ఎలివేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా జాన్వీ ఆల్ట్రా గ్లామరస్ లుక్స్ ఎలివేషన్ వైరల్ అవుతూనే ఉంది.జాన్వీ ప్రతి ఫోటోషూట్లో ఒక్కో కాన్సెప్ట్ దాగి ఉంటుంది. ఫాలోవర్స్ లో క్రేజీగా గాళ్ గా వెలిగిపోవడానికి జాన్వీ టెక్నిక్ వర్కవుటవుతూనే ఉంది. బికినీలు యోగా జిమ్ సెషన్లలో స్పోర్ట్ వేర్.. పొట్టి నిక్కర్లు ప్రతిదీ తనని పెద్ద రేంజులో ఎలివేట్ చేసే ప్రయత్నమే. హాట్ హాట్ ఫోటోలతో కుర్ర కారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది.

తాజాగా జాన్వీ థై-స్లిట్ ఎలివేషన్ హాట్ టాపిక్ గా మారింది. డిఫరెంట్ డిజైనర్ దుస్తుల్లో ఈ బ్యూటీ తళుక్కున మెరిసింది. బ్లాక్ డిజైనర్ లుక్ లో థై సొగసుల ఎలివేషన్ తో మత్తెక్కించింది. మోచేతులకు బ్లాక్ గ్లోవ్స్.. కాళ్లకు మ్యాచింగ్ బ్లాక్ హై హిల్స్ ధరించింది. ఆ వెనుక ఫ్లవరిష్ ఆర్ట్ వర్క్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. మొత్తంగా లావెండర్ స్కిన్ టోన్ తో జాన్వీ ధగధగలాడిపోతోంది. ఇన్ స్టా వేదికగా ఈ ఫోటోని స్వయంగా ఈ బ్యూటీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అన్నట్టు అతిలోక సుందరి ఆకాశం నుంచి దిగొచ్చిందా? అన్నంత అందంగా జాన్వీ కపూర్ మెరిపిస్తోంది.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తోన్న `దోస్తానా-2` లో నటిస్తోంది. అలాగే కరణ్ బ్యానర్లోనే మరో కొత్త సినిమా కి కూడా సంతకం చేసింది. `దోస్తానా-2` చిత్రీకరణ పూర్తిచేసిన తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇక సౌత్ లోనూ ఎంట్రీ ఇవ్వాలని జాన్వీ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్.. చరణ్ సరసన జాన్వీ కథానాయికగా నటించేందుకు ఆస్కారం ఉంది.