వీడియో: అబ్బబ్బో కుర్రబ్యూటీ ఒళ్లంతా తుళ్లింత

Wed Jun 09 2021 19:00:02 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest instagram Post

సోషల్ మీడియాల్లో శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ స్పీడ్ గురించి తెలిసిందే. నిరంతరం తన లైఫ్ లో ప్రతి ఈవెంట్ గురించి సినిమాలు వ్యక్తిగత విషయాల గురించి ఇక్కడ ప్రతిదీ దాచుకోకుండా చెప్పేస్తుంటుంది.జాన్వి కపూర్ తన ఇటీవలి పర్యటనకు సంబంధించిన చాలా విషయాల్ని కవర్ చేసే మాంటేజ్ వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది.  ఇందులో సరదా డ్యాన్స్ సెషన్లు.. బైక్ రైడ్ లు షికార్లు బికినీ షూట్లు మరెన్నో ఉన్నాయి. ఈ వీడియోలో జాన్వి బైక్ రైడింగ్ కు వెళుతున్నప్పుడు.. డ్యాన్స్ సెషన్ లో పాల్గొని.. బీచ్‌లో అద్భుతమైన ఫోటోషూట్ కోసం పోజులిచ్చేటప్పుడు వృత్తిగత సమయాన్ని రివీల్ చేసింది.

కోవిడ్ రెండవ వేవ్ సమయంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తమ సెలవులకు సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా విమర్శలు ఎదుర్కొన్నారు. మాల్దీవుల విహారం వివాదాస్పదమైంది. దానివల్ల ఇటీవల జాన్వి లోప్రొఫైల్ ని కొనసాగించారు. అయినా తన సోదరి ఖుషీ కపూర్ తో కలిసి జాన్వీ సిటీలో తన బైక్ లో వెళుతున్న విషయాన్ని ఫోటోగ్రాఫర్లు క్యాచ్ చేయడం ఆసక్తికరం.

జాన్వీ నటించిన రూహీ ఇటీవల రిలీజైంది. ప్రేక్షకులు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. తదుపరి 'దోస్తానా 2' లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ స్థానంలో లక్ష్ లాల్వానీ నటించనున్నారని ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. కరణ్ జోహార్ దర్శకత్వంలోని ‘తఖ్త్' లో జాన్వి నటించనుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్- కరీనా కపూర్ ఖాన్ - అలియా భట్- భూమి పెడ్నేకర్- అనిల్ కపూర్ నటించనున్నారు.