జాన్వీ వర్సెస్ రూహీ.. వ్వావ్ వ్వాటే లుక్!

Wed Feb 24 2021 18:00:01 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Stunning Pose

చందనమే పచ్చదనమే! పచ్చిక బయలు పచ్చదనమే!! ఎదకు సమ్మతం చెలిమే...!!  స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సృజనలోంచి పుట్టుకొచ్చిన బాణి ఇది. ఇదిగో ఇక్కడ జాన్వీ కపూర్ ఆ బాణీకి తగ్గట్టే డిజైనర్ లుక్ తో అదిరే స్టైల్లో దర్శనమిచ్చింది.చిలుకాకుపచ్చ డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శిస్తున్న జాన్వీని చూస్తుంటే నేటిరం ఫ్యాషనిస్టాగా ఏ స్థాయిని అందుకుందో అర్థమవుతోంది అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కపూర్ ఫ్యామిలీ నుంచి సోనమ్ కపూర్ తర్వాత ఆ లెగసీని నడిపించేస్తున్న కుర్రబ్యూటీగా జాన్వీకి కితాబు దక్కుతోంది.

చిట్టి పొట్టి నిక్కరులో కనిపించినా.. బికినీ స్విమ్ సూట్ లో చిలౌట్ చేసినా.. ఇలా అల్ట్రా మోడ్రన్ డిజైనర్ లుక్ తో దర్శనమిచ్చినా జాన్వీ తనదైన ప్రత్యేకతను ఎలివేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. జాన్వీ నటించిన రూహీ అఫ్జానా త్వరలో రిలీజ్ కి రానుంది. డే వన్ ప్రచారంలో భాగంగా జాన్వీ ఇలా ఫోటోషూట్ తో బరిలో దిగింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. కార్తీక్ ఆర్యన్ తో దోస్తానా 2 సెట్స్ పై ఉంది. ఇటీవల గుడ్ లక్ జెర్రీ అనే చిత్రానికి సంతకం చేసింది.