Begin typing your search above and press return to search.

చిల‌క ప‌చ్చ‌లో జాన్వీ జంత‌ర్ మంత‌ర్

By:  Tupaki Desk   |   11 July 2020 7:50 AM GMT
చిల‌క ప‌చ్చ‌లో జాన్వీ జంత‌ర్ మంత‌ర్
X
చిల‌కాకు ప‌చ్చ .. ఆ డిజైన్ కి ఉండే కిక్కే వేరు. ఇదిగో లేటెస్టుగా యంగ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ధ‌రించిన చిల‌కాకు ప‌చ్చ డిజైన‌ర్ వేర్ మ‌తి చెడ‌గొడుతోంది. జాన్వీ కోస‌మే పుట్టిందా? అన్న‌ట్టుగా ఆ డిజైన‌ర్ వేర్ ని తీర్చిదిద్దిన తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆ వైట్ టాప్ .. వైట్ బాట‌మ్ తో అంత‌గా కిర్రెక్కించేస్తున్న జాన్వీకి ఆ టాప్ పైన మెడ‌పై అద్భుత‌మైన చిల‌కాకు ప‌చ్చ డిజైన్ ని సెట్ చేసిన తీరు ఇంప్రెస్సివ్ అనే చెప్పాలి. ఈ మొత్తం ఫోటోషూట్ కి బ్యాక్ గ్రౌండ్ లో వైట్ డిజైన్ ప‌ర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది. ఓవ‌రాల్ గా చిల‌కాకుప‌చ్చ డామినేష‌న్ తో ఫోటోషూట్ అద‌ర‌గొట్టేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు జాన్వీ ఫ్యాన్స్ లో వైర‌ల్ గా మారాయి. ఇటీవ‌ల క్వారంటైన్ టైమ్ ని పాపా బోనీక‌పూర్ .. సోద‌రి ఖుషీ క‌పూర్ స‌హా క‌పూర్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాల్సి వ‌చ్చింది. వీలున్న‌ప్పుడ‌ల్లా ఇదిగో ఇలా లేటెస్ట్ ఫోటోషూట్ల‌కు టైమ్ కేటాయిస్తోంది. అన్న‌ట్టు జాన్వీ న‌టించిన కార్గిల్ గ‌ర్ల్ మూవీ ఏమైంది? అంటే ఇది త్వ‌ర‌లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అమితాబ్ గులాబో సితాబో త‌ర్వాత రిలీజ్ బ‌రిలో ఉన్న చిత్ర‌మిది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదే సంస్థ‌లో త‌క్త్ అనే భారీ హిస్టారిక‌ల్ వారియ‌ర్ చిత్రంలోనూ జాన్వీ న‌టిస్తోంది. దీంతో పాటే మ‌రో రెండు మూడు చిత్రాల‌కు సంత‌కాలు చేయ‌గా కొవిడ్ విల‌యం వ‌ల్ల ఇవ‌‌న్నీ చిత్రీక‌ర‌ణ‌లు వాయిదా ప‌డ్డాయి.