Begin typing your search above and press return to search.

జాన్వీ మైండ్ బ్లాక్..అందుకే అలా చేసిందా?

By:  Tupaki Desk   |   7 Dec 2022 4:46 AM GMT
జాన్వీ మైండ్ బ్లాక్..అందుకే అలా చేసిందా?
X
ఖాళీ స‌మ‌యం చిక్కితే జాన్వీ క‌పూర్ వెకేష‌న్ మోడ్ లోకి జారుకుంటుంది. అంద‌మైన దేశాల‌న్నింటిని ఒంట‌రిగానే చుట్టేస్తుంది. ఇక ముంబైలో స్నేహితుల‌తో పార్టీలు వంటివి చాలా స‌హ‌జం. వీకెండ్ పార్టీలు...గెట్ టూ గెద‌ర్ పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తుంది. అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో చెల్లి ఖుషీ క‌పూర్ కూడా వెంట ఉంటుంది. ఇద్ద‌రి క‌లిసి జంట‌గా ప‌బ్ ..రెస్టారెంట్లో బాల మిత్రుల‌తో ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.

జాన్వీ పార్టీకి అటెండ్ అయితే మెరుపుల‌తో పాటు మ‌త్తెక్కించే ఫోటోలు అంతే ఆస‌క్తిక‌రం. అయితే ఈసారి వాటికి బ‌ధులుగా ఓ వీడియోతోనే నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఓ రెస్టారెంట్ లో పార్టీ ముగుంచికుని అమ్మ‌డు బ‌య‌ట‌కు వ‌చ్చింది. వెంట కెమెరా మ్యాన్లు..ఫోటో గ్రాఫ‌ర్లు వెంబ‌డించి మ‌రీ ఫోటోలు తీసారు. అయితే ఆస‌మ‌యంలో జాన్వీ మైకంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఎదురుగా కారు ఉన్నా...అదే ఎదురుగా త‌న కారు డ్రైవ‌ర్ ఉన్నా? వాళ్లిద్ద‌రు ఎక్క‌డ అంటూ ముందున్న ఫోటో గ్రాఫ‌ర్ల‌ని అడిగింది. అదుగోండి మేడం అని చెప్పినా కూడా మేడం గారికి స‌రిగ్గా అర్ధం కాలేదు. ఎక్క‌డ‌?ఎక్క‌డ? అంటూ రిపీటెడ్ గా అడిగేది. దీంతో జాన్వీ అస‌లు మ‌న లోకంలో ఉందా? ఇంకేదైనా మైకంలో ఉందా? అంటూ అక్క‌డ మీడియా వాళ్ల‌లో చ‌ర్చ‌కొచ్చింది.

జాన్వీ ఎప్పుడూ ఇలా క‌నిపించ‌లేదు. పార్టీ ఎంత ఎంజాయ్ చేసినా ఇలాంటి మ‌తి మ‌రుపు విధంగా ఎక్క‌డా ప్ర‌వ‌ర్తించ‌లేదు. తొలిసారి అలా క‌నిపించేస‌రికి అంతా షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అలాగే ట్రోలింగ్ కి గుర‌వుతుంది. అమ్మ‌డు ఏమైనా ప‌రిమితికి మించి ఆల్కాహాల్ తీసుకుందా? అంటూ పందేహం వ్య‌క్తంచేస్తున్నారు.

అలా కాక‌పోతే కారు...కారు డ్రైవ‌ర్ ని మ‌ర్చిపోవ‌డం ఏంటి? అంటూ గుస గుస‌లాడుకుంటున్నారు. మ‌రి ఈ వీడియో పై జాన్వీ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవ‌లే అమ్మ‌డు `మిలీ` సినిమాతో ప‌రేక్ష‌కుల ముందుకొచ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ చేసారు.

కానీ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఏ సినిమానా జాన్వీ ఇలా ప్ర‌మోట్ చేయ‌లేదు. కానీ ఫ‌లితం మాత్రం ఆశాజ‌న‌కంగా లేక‌పోయింది.