అతిలోక సుందరిని మరిపించిన జాన్వీ!

Sun Dec 05 2021 11:00:01 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Photo

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీకపూర్ కెరీర్ జర్నీ జెట్ స్పీడ్ అందుకున్న సంగతి తెలిసిందే. పైనుంచి మామ్ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉన్నాయి. కెరీర్ ఉత్తమ దశలో ఉంది జాన్వీ. దీనికోసం పాపా బోనీకపూర్ .. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ తనకు ఉన్నాయి. ఇటీవల జాన్వీ వరస ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా జాన్వీ చీరకట్టులో మైండ్ బ్లాక్ చేసింది. చీర కట్టులో అచ్చంగా మామ్ శ్రీదేవినే తలపించింది జాన్వీ. ఇప్పటికే శారీ లుక్ లో చాలాసార్లు ఇది ప్రూవ్ అయింది. పాశ్చాత్య కల్చర్ ని పక్కనబెట్టి సంప్రదాయ పద్ధతిలో జాన్వీ మేకోవర్ అచ్చంగా శ్రీదేవి కి జెరాక్స్ అనేంతగా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రఖ్యాత హిందుస్తాన్ టైమ్స్  లీడర్ షిప్ సమ్మిట్  కి హాజరైన సందర్భంగా జాన్వీ కపుర్  తెలుగమ్మాయి లుక్ లో కనిపించింది. ప్లోరల్ ప్రింట్ తో కూడిని సీ-త్రూ ఆర్గాన్జా నెట్ చీరని ధరించింది. మ్యాచింగ్ వైట్ స్లీవ్ లెస్ లెస్ బ్లైజ్ ధరించింది. చేతికి బ్లాక్ మెటల్ ఆభరణం మరో ఆకర్షణ. జాన్వీ హెయిర్ స్టైల్ లో శ్రీదేవి సిగ్నెచర్ కనిపిస్తుంది.  మేకప్ పర్ పెక్ట్ గా మ్యాచ్ అయింది. చీరకట్టులో బాపు బొమ్మలా ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఈవెంట్ ప్రీ షూట్ ఆకట్టుకుంది. ఇది మరో కొత్త లుక్.. ఇక్కడా చీరకట్టుల్లో అచ్చంగా అందమైన మామ్ ని తలపిస్తుందని నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు. ఇలా పాత తరం ఫ్లోరల్ లుక్ డిజైనర్ శారీలో కాస్త జూ.అతిలోక సుందరి పోలికను రిపీట్ చేసింది జాన్వీ. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. జాన్వీ అభిమానులు చీరకట్టులో చూడటానికి రెండు కళ్లు సరిపోలేదంటూ మురిసిపోతున్నారు.

ఇక జాన్వీ  సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో  `దోస్తానా-2` లో  నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్  కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.