Begin typing your search above and press return to search.

పొట్టి నిక్క‌రులో జాన్వీ ప‌బ్లిగ్గా.. వెంటాడిన కెమెరాలు!

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:30 PM GMT
పొట్టి నిక్క‌రులో జాన్వీ ప‌బ్లిగ్గా.. వెంటాడిన కెమెరాలు!
X
`ధ‌డ‌క్` చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీక‌పూర్ కెరీర్ ధేధీప్యమానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే స‌క్సెస్ అందుకుని అటుపై ప్ర‌తిభావ‌నిగా గుర్తింపును సొంతం చేసుకుని ముందుకి సాగిపోతోంది. త‌న‌ని అగ్ర నాయిక‌గా నిల‌బెట్టేందుకు తండ్రి బోనీ క‌పూర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. క‌ర‌ణ్ సూచ‌న‌లు.. స‌ల‌హాలు పాటిస్తూ కెరీర్  ని బ‌లంగా బిల్డ్ చేసుకుంటోంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ కూడా జాన్వీ కెరీర్ విష‌యంలో ఎంతో శ్ర‌ద్ధ‌ తీసుకుంటున్నారు. త‌న నిర్మాణ సంస్థ‌లోనే వ‌రుస‌గా సినిమాలు చేసేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం అదే బ్యాన‌ర్లో రెండు..మూడు సినిమాల కమిట్ మెంట్లు ఉన్నాయి.  

ఇలా కెరీర్ ప‌రంగా వెన‌క్కి తిరిగి చూసుకునే ప‌నిలేని స్థాయికి జాన్వీ క‌పూర్ ఎదిగింది. ద‌క్షిణాది చిత్రాల్లోనూ లాంచ్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే బోనీ క‌పూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త‌ర్వాత‌నే ఇత‌ర భాష‌ల్లో లాంచ్ చేయించాల‌ని చూస్తున్నారు. ఆ సంగ‌తిని ప‌క్క‌న‌బెడితే జాన్వీ వ‌రుస‌ ఫోటోషూట్ల గురించి తెలిసిందే. స్టైలిష్ హాటెస్ట్ గాళ్ గా ఫోక‌స్ అవ్వ‌డానికి ఎక్కువ‌గా ప్రయ‌త్నిస్తోంది. డిజైనర్ దుస్తుల్లో త‌ళుక్కున మెరుస్తూ చూప‌రుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకోవ‌డం జాన్వీకే చెల్లింది.

తాజాగా మ‌రోసారి జాన్వీ వేడెక్కించే అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. పొట్టి నిక్క‌రు ధ‌రించి.. టాప్ లో బ్లౌజు అందాల‌తో మ‌తులు చెడ‌గొట్ట‌డం జాన్వీకే చెల్లింది. ముంబై సిటీలో ఓ క్లినిక్ కి  హాజరై అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో జాన్వీ క‌పూర్ ఇలా కెమెరాకి చిక్కింది. వైట్ షార్ట్స్ బ‌నియ‌న్ తో హాట్ గా క‌నిపించింది.  ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. జాన్వీ అభిమానులు హాట్ కామెంట్ల‌తో ఎటాక్ షురూ చేసారు. ఇలా పొట్టి నిక్క‌రులో ప‌బ్లిగ్గా జాన్వీ చాలాసార్లు కెమెరా కంటికి దొరికింది. మంచి మ‌న‌సుతో అడిగిన వాళ్ల‌కు సెల్ఫీలు సైతం ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం  జాన్వీ క‌పూర్ సినిమాల లైన‌ప్ చూస్తే `దోస్తానా2`లో న‌టిస్తోంది. అలాగే  `గుడ్ ల‌క్ జెర్రీ`..`మిలీ` చిత్రాల‌ షూటింగ్ ని పూర్తిచేసింది. త్వ‌ర‌లో ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.