Begin typing your search above and press return to search.

#అడ్వెంచ‌ర్‌: జాన్వీ జీవితంలో ఒక‌రోజు ఇలా

By:  Tupaki Desk   |   27 Oct 2021 1:30 AM GMT
#అడ్వెంచ‌ర్‌: జాన్వీ జీవితంలో ఒక‌రోజు ఇలా
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ ఓవైపు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నా వరుస వెకేష‌న్ల‌తో రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతోంది. జాన్వీ నిరంత‌ర ఫోటోషూట్ల గురించి తెలిసిందే. అల్ట్రా మోడ్ర‌న్ ఫ్యాష‌నిస్టాగా ఇప్ప‌టికే యూత్ కి క‌నెక్ట‌యిపోయిన జాన్వీ చాలా రేర్ గానే ట్రెడీష‌న‌ల్ లుక్స్ లో క‌నిపిస్తుంది. జిమ్ కి వెళ్లినా..యోగా సెంట‌ర్లో ఉన్నా! టెంప్టింగ్ ఫోటోషూట్లకు కొద‌వేమీ ఉండ‌దు. యువ‌న‌టి భంగిమ‌ల‌కు కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు చెల‌రేగాల్సిందే. ఇన్ స్టా వేదిక‌గా ఆ ఫోటోలు అంతే వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా జాన్వీ కొండ‌కోన‌ల్లో ట్రెక్కింగ్ కి వెళ్లింది. ఈ ఫోటోల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఇందులో జాన్వీ ఆరెంజ్ క‌ల‌ర్ స్కిన్ టైట్ ఫ్యాంట్.. టాప్ లో లేత గులాబీ రంగు బ‌నియ‌న్ ధ‌రించి టాప్ యాంగిల్ లో అందాలను ఎలివేట్ చేస్తోంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. జాన్వీ జీవితంలో ఒక‌రోజు! అంటూ ఈ ఫోటోకి వ్యాఖ్య‌ను జోడించింది. ఇక కొండ కోన‌ల్లో జాన్వీ రోప్ ఆధారంగా వెళుతూ చాలా సాహ‌సాలే చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. జాన్వీ ఫాలోవ‌ర్స్ ఈ ఫోటోగ్రాఫ్స్ పై హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇక జాన్వీ టూ పీస్ లో ఎక్స్ ఫోజింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పూల్ సైడ్...బీచ్ సైడ్ చిట్టి పొట్టి దుస్తుల్లో విందుకు అయితే కొద‌వే లేదు. ఇటీవ‌ల జాన్వీ హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగిపోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇక జాన్వీ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుత క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో `దోస్తానా-2` లో న‌టిస్తోంది. అదే బ్యాన‌ర్ లో మ‌రో రెండు చిత్రాలు క‌మిట్ అయింది.

అలాగే అమ్మ‌డు న‌టించిన `గుడ్ ల‌క్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక ద‌క్షిణాదిన ఎంట్రీ ఇవ్వ‌డానికి జాన్వీ ఆస‌క్తిగానే ఉంది. కానీ స‌రైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోవ‌డానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. త‌ల్లి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.