ఫోటో స్టోరి: హీటెక్కించడంలో మలైకాకే అక్కయ్య!

Wed Jun 23 2021 16:48:50 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Photo

లోదుస్తుల ప్రదర్శనలో సీనియారిటీని పరిశీలిస్తే మలైకా అరోరాఖాన్ ముందు ఎందరు భామలున్నా దిగదుడుపే.  ముంబై వీధుల్లో మలైకా నిరంతర రియాలిటీ షోలపై అవగాహన ఉన్న ఎవరైనా కానీ తనని కొట్టేవాళ్లే లేరని అంగీకరిస్తారు.50 ఏజ్ కి చేరువలో ఉన్నా మలైకా నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నారు. లోదుస్తులు ధరించినా.. దేహాన్ని అతుక్కుపోయే టైట్ దుస్తులతో ట్రీటిచ్చినా.. జిమ్ యోగా అంటూ టైట్ ట్రాక్ లతో వీధుల్లో ప్రత్యక్షమైనా తన ముందు ఎవరూ నిలవలేని పరిస్థితి. ట్వెంటీ మైనస్ బ్యూటీలకైనా సాధ్యం కాని విన్యాసాలతో చెలరేగడం మలైకా ప్రత్యేకత.

కానీ ఈ అమ్మడికి ధీటైన పోటీ కుర్రభామల్లో ఎవరి నుంచి ఉంది? అంటే జాన్వీ కపూర్  పేరు యూత్ లో వినిపిస్తోంది. గత కొంతకాలంగా జాన్వీ వరుస బికినీ షూట్లు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. ఇక చిట్టి పొట్టి నిక్కర్లలో కనిపించినా.. పబ్లిక్ లో బాటమ్ లెస్ ఫోజులతో చెలరేగినా జాన్వీ పేరు సంచలనంగా మారింది. ఇప్పుడు కూడా జిమ్ నుంచి వస్తూ టైట్ వైట్ అండ్ వైట్ స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపించిన జాన్వీ ఒక్కసారిగా అగ్గి రాజేసింది. వైట్ కలర్ కి కాంబినేషన్ గా రెడ్ మాస్క్ ని ధరించిన జాన్వీ కపూర్ జిమ్ నుంచి వస్తూ.. నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో వేడెక్కించింది. జాన్వీ తదుపరి దోస్తానా 2లో నటిస్తోంది. వరుసగా భారీ చిత్రాలు క్యూ లో ఉన్నాయి.