ఫోటో స్టోరి: ఆ కళ్లతోనే మాయ చేస్తోంది

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Photo

అందానికి అందం ప్రతిభతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ యువతరంలోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ భామకు ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతోంది. సినిమా సినిమాకి పరిణతి చెందిన నాయికగా పేరు తెచ్చుకుంటోంది. యూత్ హార్ట్ త్రోబ్ గా వెలిగిపోతోంది.సోషల్ మీడియాల్లో జాన్వీ ఫోటోషూట్లు తన ఇమేజ్ ని పెంచుతున్నాయి. ఇంతకుముందు మాల్దీవుల విహారంలో బికినీ ఫోటోషూట్ తో దుమారం రేపింది. అలాగే రీసెంట్ గా ప్రఖ్యాత ట్రావెల్ ప్లస్ మ్యాగజైన్ కవర్ షూట్ కి సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి.

తాజాగా జాన్వీ వెట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ యూనిక్ అని పొగిడేస్తోంది యూత్. ఆ కళ్లతోనే మాయ చేస్తూ.. గుండెలకు గాయం చేస్తోంది. అందుకే అటు బాలీవుడ్ కే ఈ అమ్మడు పరిమితమైతే తెలుగు ఆడియెన్ చాలా మిస్సయినట్టు. అన్నీ కుదిరితే ఈపాటికే ఏ చరణ్ తోనో.. దేవరకొండతోనో పరిచయమయ్యేదే.  కానీ ఇప్పుడు ఏకంగా మహేష్ సరసన జాన్వీ పేరును పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2022లో జాన్వీకి టాలీవుడ్ లో మహర్ధశ పట్టనుందనే గుసగుస వేడెక్కిస్తోంది. ఇక్కడ ఓ సినిమాలో నటించేస్తే అటుపై వరుసగా స్టార్ హీరోలతో ఆఫర్లు క్యూకట్టేయడం గ్యారెంటీ. కెరీర్ మ్యాటర్ కి వస్తే జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ.. దోస్తానా 2 వంటి చిత్రాల్లో నిస్తున్నారు. కరణ్ జోహార్ తఖ్త్ పెండింగులో ఉంది.