ఫోటో స్టోరీ: వెరైటీ డ్రెస్సులో వెరీ బ్యూటిఫుల్

Wed Jan 15 2020 18:00:06 GMT+0530 (IST)

Janhvi Kapoor Glamourous pose

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్.  మొదటి సినిమా 'ధడక్' సినిమాతో పాసు మార్కులే తెచ్చుకుంది. అయితే ఈ మార్కులతో సంబంధం లేకుండా శ్రీదేవి డాటర్ కావడంతో క్రేజ్ మాత్రం ఎక్కువే ఉంది. ఇక కరణ్ జోహార్ సపోర్ట్ ఫుల్ గా ఉంది. అందుకే చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి.  సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.  ఒకవేళ తను స్వయంగా ఫోటోలను షేర్ చేయకపోయినా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.  జాన్వి రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.  వైట్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉండే పొట్టి గౌన్ ధరించి పోజులిచ్చింది.  ఈ గౌన్ వెరైటీగా ఒక చేతికి స్లీవ్.. మరో చేతికి స్లీవ్ లెస్ ఉంది. ఈ డ్రెస్ కు పసుపు రంగు బెల్టు పెట్టుకుంది.  కాళ్లకు హై హీల్స్ ధరించి.. మొహానికి పర్ఫెక్ట్ మేకప్.. సింపుల్ గా కనిపించే హెయిర్ స్టైల్ తో జాన్వి ఎంతో మోడరన్ గా ఉంది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  లైక్స్ తో.. షేర్ ల తో హోరెత్తిస్తున్నారు. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది. 'రూహి అఫ్జానా'.. 'దోస్తానా 2' చిత్రాలలో కూడా నటిస్తోంది.