కాబోయే భర్తపై జాన్వీ కలలు వేరె లెవల్ అంతే!

Sat Jun 25 2022 19:00:01 GMT+0530 (IST)

Janhvi About Her Fiancee

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. 'దఢక్' అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ స్టార్ కిడ్.. తొలి సినిమాతోనే మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. కానీ.. అందం అభినయం అంతకు మించి టాలెంట్ ఉన్నా జాన్వీకి సరైన హిట్ మాత్రం పడటం లేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ తన హోప్స్ అన్నీ 'గుడ్ లక్ జెర్రీ' పైనే పెట్టుకుంది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ ఆనంద్ ఎల్. రాయ్ సంయుక్తంగా నిర్మించారు. 2018లో నయనతార ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'కొలమావు కోకిల(తెలుగులో కో కో కోకిల)'కి రీమేక్ గా రూపుదిద్దుకున్న చిత్రమిది.

కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 29న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జాన్వీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్.. తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పుకొచ్చింది. జాన్వీ మాట్లాడుతూ.. 'అతను సూపర్ టాలెంటెడ్ అయ్యుండాలి. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను కలిగి ఉండాలి. తన గోల్స్ ను రీచ్ అయ్యేందుకు సిన్సియర్ గా వర్క్ చేయాలి.

అలాగే అతనితో ఉన్నప్పుడు నాలో ఉత్సాహం రావాలి. అతని నుంచి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా ఉండాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా.. నన్ను అమితంగా ప్రేమించాలి. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా చూసుకోవాలి. అలాంటి వ్యక్తే నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఏదేమైనా జాన్వీ మాటలు వింటుంటే.. కాబోయే భర్తపై ఆమె వేరె లెవల్ లో కలలు కంటోందని స్పష్టంగా అర్థం అవుతోంది.

కాగా జాన్వీ కపూర్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. దోస్తానా 2 హెలెన్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఈ బ్యూటీని సౌత్ లోకి కూడా తీసుకురావాలని ఇక్కడ దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఓ స్టార్ హీరో మూవీతో ఈమె ఎంట్రీ ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు.