'జనగనమణ' నిజంగా అదే కాన్సెప్ట్ అయితే దుమారం రేగడం ఖాయం!

Thu Jul 07 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Janaganamana Movie Concept

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జనగనమణ. ఇప్పటికే ఈ సినిమా వర్క్ మొదలు అయ్యింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన లైగర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. వచ్చే నేలలో విడుదల కాబోతున్న లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా లైగర్ రాబోతుంది.లైగర్ సినిమా తరహాలోనే దేశ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ జనగనమణ సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక సైనిక పాలన కు సంబంధించిన స్క్రిప్ట్ ఆ తెలుస్తోంది. దేశంలో రాజకీయ వ్యవస్థలు విచ్చినం అయ్యి.. సుస్థిర ప్రభుత్వంను ఏర్పాటు చేయలేక పోతే అప్పుడు ఆర్మీ అధికారం ను చేజించుకోవచ్చు.

జనగనమణ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ అయిన విజయ్ దేవరకొండ ఆ సమయంలో ఎలా వ్యవహరించాడు.. ప్రభుత్వం చేతిలో ఉండగా ఆర్మీ చేసే విధులు ఏంటీ.. దేశం ను కాపాడుకోవడంతో పాటు.. దేశ అంతర్గత విషయాలను ఎలా కాపాడుకుంటారు అనేది సినిమాలో చూపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనగనమణ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

దేశంలో ఆర్మీ పరిపాలన అనేది వివాదాస్పద అంశం. కనుక ఈ సినిమా విడుదల అయ్యే సమయం కు లేదా విడుదల అయిన తర్వాత కచ్చితంగా వివాదాన్ని రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ అదే అయితే ప్రభుత్వం తో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా విషయంలో అంతా ఆసక్తిగా ఉన్నారు.

సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా జనగనమణ సినిమా యూనిట్ సభ్యులు కేంద్ర రక్షణ శాఖను కలవడం జరిగింది. కనుక ఆ సమయంలోనే సినిమా కాన్సెప్ట్ చెప్పేసి ఉంటారు. వారి నుండి ఎలాంటి అవాంతరాలు అడ్డంకులు రాలేదు.

పైగా ఆర్మీ తో కలిసి షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఆ కాన్సెప్ట్ అనేది పుకారు అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.