Begin typing your search above and press return to search.

'చెక్' పై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:00 AM GMT
చెక్ పై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
నితిన్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చెక్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరియు వరుణ్ తేజ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా వ్యాఖ్యలు చేశాడు. సినిమాపై తనకు చాలా ఆసక్తి ఉందని ఎప్పుడెప్పుడు చూడాలా అన్నట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత థియేటర్ కు వెళ్లి చూడాలని ఆసక్తిగా ఉన్న సినిమా చెక్. ఈ సినిమా మొత్తం కూడా జైలులో తీయడం ఇంట్రెస్ట్ ను కలిగించింది. ఈ సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అంటూ రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశాడు. థియేటర్ కు వెళ్లి సినిమా ఎప్పుడు ఎప్పుడు చూస్తాన అంటూ ఎదురు చేస్తున్నట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. జక్కన్న చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.