వీడియో సాంగ్: అదరగొట్టిన డాన్సింగ్ స్టార్స్

Sat Sep 21 2019 13:57:53 GMT+0530 (IST)

Jai Jai Shivshankar Song From Hrithik Roshan War Movie

అక్టోబర్ 2న సైరాతో పోటీ పడుతున్న వార్ తాలూకు ప్రమోషన్ మెల్లగా స్పీడందుకుంది. ఇక్కడి లాగా లిరికల్ సాంగ్స్ కాకుండా ఏకంగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం బాలీవుడ్ లో రెగ్యులర్ గా కొనసాగే ట్రెండ్. అందులో భాగంగానే వార్ లోని ఓ డాన్సింగ్ నెంబర్ యాష్ రాజ్ సంస్థ విడుదల చేసింది. ఒకరేమో డాన్స్ లో బెంచ్ మార్క్ సృష్టించిన సీనియర్ స్టార్. మరొకరేమో ఇప్పుడిప్పుడే స్టార్ డం ను అందుకుంటూ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యూత్ హీరో. ఇక ఇద్దరు కలిస్తే చెప్పేదేముంది.వార్ లో అలాంటి కనులపండుగ అనిపించే సాంగ్ జై జై శివ శంకర్ ఇప్పుడు ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. రంగులు చల్లుకుంటూ పండగ సంబరాన్ని జరుపుకుంటూ ఒకరితో మరొకరు పోటీ అనిపించేలా హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ లు నృత్యం చేస్తుంటే రిపీట్ మోడ్ లోకి వెళ్లకుండా ఆగడం కష్టం. ఆ రేంజ్ లో స్టెప్స్ తో ఇద్దరూ అదరగొట్టేశారు.

ముఖ్యంగా హృతిక్ నాలుగు పదుల వయసు ఎప్పుడో దాటేసినా కుర్ర హీరో కు దీటుగా ఇంకా చెప్పాలంటే తనను డామినేట్ చేసే రేంజ్ లో డాన్స్ తో మెస్ మరైజ్ చేయడం విశేషం. విశాల్ శేఖర్ ఇచ్చిన ట్యూన్ రెగ్యులర్ బీట్స్ లో ఉన్నట్టే అనిపించినా విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మొత్తానికి అంచనాలు పెంచేలా ఉన్న ఈ వీడియో సాంగ్ తో కేవలం యాక్షన్ ఫిలిం అన్న అభిప్రాయం ఉన్న వార్ మీద మాస్ లో కొత్త హైప్ పెంచడం ఖాయమే