Begin typing your search above and press return to search.

సునీల్‌ మోసం చేశాడు.. రవితేజ మంచోడు

By:  Tupaki Desk   |   27 Jan 2020 7:11 AM GMT
సునీల్‌ మోసం చేశాడు.. రవితేజ మంచోడు
X
'ఆనందం' చిత్రంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకుని మ్యాటర్‌ ఉన్న కుర్రాడు అంటూ ప్రశంసలు దక్కించుకున్న హీరో ఆకాష్‌. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడంతో కెరీర్‌ పరంగా చాలా ఉన్నత స్థితికి వెళ్తాడని చాలా మంది అనుకున్నారు. కాని కొన్ని తప్పుడు నిర్ణయాలు మరియు కాలం కలిసి రాకపోవడంతో ఆకాష్‌ కెరీర్‌ చాలా తక్కువ కాలంలోనే ముగిసిందని చెప్పుకోవచ్చు. హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలన్‌ గా కూడా ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రాలేదు.

చాలా ఏళ్లు కనిపించకుండా పోయి అంతా మర్చి పోతున్న సమయంలో మళ్లీ మీడియా ముందుకు వచ్చి ఏదో సినిమా అంటూ ప్రకటించి జనాల్లో తాను ఒకడిని ఉన్నాను అంటూ గుర్తు తెచ్చాడు. ఆకాష్‌ ఆమద్య ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం సమయంలో ఆ కథ నాది నేను సినిమా తీశాను.. విడుదలకు సిద్దం చేస్తున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి వివాదం చేసేందుకు చూశాడు. సినిమా విడుదల తర్వాత ఏం జరిగిందో ఏమో కాని సైలెంట్‌ అయ్యాడు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆకాష్‌.. సునీల్‌ మరియు రవితేజల పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

ఇండస్ట్రీలో నన్ను చాలా మంది వాడుకుని వదిలేశారంటూ ఆకాష్‌ అన్నాడు. అందాల రాముడు సినిమా షూటింగ్‌ సమయంలో సునీల్‌ నా వద్దకు వచ్చి గెస్ట్‌ రోల్‌ చేయాల్సిందిగా కోరాడు. సరేనని నేను ఆ పాత్రను చేశాను. సినిమా మంచి విజయం సాధించింది. సినిమా సక్సెస్‌ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేయక పోవడంతో పాటు.. కనీసం అక్కడ నా పేరును కూడా ప్రస్తావించలేదు. సునీల్‌ నన్ను మోసం చేశాడంటూ ఆకాష్‌ ఆసహనం వ్యక్తం చేశాడు.

ఇక ఇండస్ట్రీలో నాకు స్నేహితుడు అంటే కేవలం రవితేజ మాత్రమే. మేమిద్దరం కెరీర్‌ ఆరంభంలో కలిసి నటించాం. ఆ కారణంగానే ఇప్పటికి కూడా రవితేజ నన్ను అభిమానంతో పలకరిస్తాడు. మేమిద్దరం ఇప్పటికి స్నేహంగా ఉంటున్నామన్నాడు. ఇండస్ట్రీలో ఒక హీరో ఎదగాలి అంటే ఇంకో హీరోను ఖచ్చితంగా తొక్కేయాల్సిందే అని.. అలా నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారంటూ ఆకాష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేను రాసుకున్న కథతో పూరి ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తీశాడు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌ మరియు టీజర్‌ చూసి ఉంటే అప్పుడే కోర్టుకు వెళ్లే వాడిని. నేను సినిమాను అడ్డుకోవాలి అంటే సినిమా విడుదల రోజునైనా కోర్టులో కేసు వేస్తే ఆ సినిమా కలెక్షన్స్‌ ఇన్ని వచ్చి ఉండేవన్నాడు.