సరిలేరు నుంచి జగ్గు భాయ్ అవుట్ ?

Tue Jul 16 2019 13:53:41 GMT+0530 (IST)

ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ మొదలుపెట్టుకున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుకు మొదటి ట్విస్ట్ జరిగిపోయింది. ఇందులో ముందు ఓకే అనుకున్న జగపతిబాబు తప్పుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారట. జగ్గు భాయ్ బయటికి రావడానికి కారణాలు తెలియదు కాని పాత్రకు సంబంధించిన రీజనే అయ్యుంటుంది. ప్రస్తుత షెడ్యూల్ లో ఈ పాత్ర లేకపోవడంతో పెద్దగా ఇబ్బంది లేదు కాని ఇక్కడికి తిరిగి వచ్చాక ఇదే చాలా కీలకంగా ఉంటుందట.13 ఏళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న మూవీగా సరిలేరు నీకెవ్వరుకి మరో ఆకర్షణగా ఆవిడ నిలుస్తున్నారు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కలిసి నటించారు కాని విజయశాంతి జగపతి బాబు తర్వాత ఒకే సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు సరిలేరుతో ఇది సాధ్యమవుతోంది అనుకుంటే ఆఖరికి ఇలా బయటికి వచ్చేశారట. మహేష్ బాబు మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కాశ్మీర్ షెడ్యూల్ కాగానే హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో షూట్ కంటిన్యూ చేస్తారు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉండొచ్చని టాక్. మరో లీకైన న్యూస్ ప్రకారం విజయశాంతి జగపతిబాబు ప్రత్యర్థులుగా కనిపించేలా పవర్ ఫుల్ రోల్స్ సెట్ చేశాడట అనిల్ రావిపూడి. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ రీ ప్లేస్ అయ్యాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకోలా ఉంటుందేమో. మహేష్ ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ ఒక్కడు నుంచి మహర్షి దాకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో మరోసారి రిపీట్ కానుండటంతో హిట్ సెంటిమెంట్ కూడా తోడవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. 2020 సంక్రాంతికి రిలీజవుతున్న సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న హీరొయిన్