మహేష్ మూవీ గురించి జగ్గు భాయ్ క్లారిటీ

Fri Jul 19 2019 17:22:27 GMT+0530 (IST)

మహేష్ బాబు 26వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు ఇందులో నుంచి బయటికి రావడం గత కొద్దీ రోజులుగా హాట్ టాపిక్ గా ఉంది. ఏవో మనస్పర్థలు రావడం వల్లే వదులుకున్నారని అనిల్ రావిపూడితో పొసగలేదని ఇలా ఏవేవో ప్రచారాలు జరిగాయి. వాటికి వీడియో రూపంలో జగపతి బాబు స్వయంగా చెక్ పెట్టేశారు.తన 33 ఏళ్ళ నట జీవితంలో ఎన్నడూ ఇలా చెప్పాల్సిన అవసరం పడలేదని ఒక కుటుంబంగా భావించే సినిమా యూనిట్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ కావడం ఎక్కడికో దారి తీయడం వల్ల స్వయంగా చెబుతున్నానని క్లారిటీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరూలో తనకు పాత్ర బాగా నచ్చిందని దీని కోసమే మరో రెండు సినిమాలు వదులుకుని మరీ సైన్ చేసానని కానీ అనివార్య కారణాల వల్ల ఇలా జరిగిందే  తప్ప ఇంకే విశేషం లేదని కుండ బద్దలు కొట్టేశారు.

ఇది ఏ ఆర్టిస్టుకైనా సహజంగా జరిగేదే అని కాకపోతే గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నందున చెప్పక తప్పలేదని జగ్గు భాయ్ ఫైనల్ గా ఈ ఇష్యూ ని క్లోజ్ చేశారు. అనిల్ రావిపూడి కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇదంతా అనుకోకుండా జరిగిందని భవిష్యత్తులో ఆయనతో పని చేసేందుకు ఎదురు చూస్తానని పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ఆయన పట్ల తమ గౌరవం సదా ఉంటుందని మెసేజ్ పెట్టాడు.  దీంతో సరిలేరు నీకెవ్వరూ విషయంలో జగపతి బాబు పాత్రకు సంబంధించి జరుగుతున్న ప్రచారం కంచికి గాసిప్ క్లైమాక్స్ కు చేరుకుంది