Begin typing your search above and press return to search.

'జగమే తంత్రం' స్ట్రీమింగ్ టైమ్ అదేనట..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 5:30 AM GMT
జగమే తంత్రం స్ట్రీమింగ్ టైమ్ అదేనట..!
X
దేశంలో కరోనా కారణంగా మొదటిసారి థియేటర్లు మూతపడి మళ్లీ తెరుచుకున్నాక కూడా సినీప్రేక్షకులు ఇంకా ఓటిటి ప్లాట్ ఫాములనే ఇష్టపడుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. అంటే లాక్డౌన్ సమయంలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ జనాలపై ఎలాంటి ప్రభావం చూపించాయో తెలుస్తుంది. కొత్త సినిమాల దగ్గర నుండి వెబ్ సిరీస్ వరకు అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న కారణంగా జనాలు ఓటిటిలకు అలవాటు పడిపోయారు. ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటి స్ట్రీమింగ్ వైపు ప్రేక్షకులు ఇంటరెస్ట్ చూపడం కాదు. ఏకంగా సినీ హీరోలే ఓటిటి వైపు మళ్లుతుండటం గమనార్హం.

ఆల్రెడీ కరోనా సెకండ్ వేవ్ ముందు థియేటర్స్ తెరుచుకొని భారీ సినిమాలు ఓటిటిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎలాగో థియేటర్స్ లేవు కాబట్టి అప్ కమింగ్ హీరోల దగ్గర నుండి స్టార్స్ వరకు థియేటర్స్ ఓపెన్ అయినా కూడా డిజిటల్ రిలీజ్ వైపు ఫోకస్ పెడుతున్నారు. ఈ డిజిటల్ గోలంతా ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలోనే కనిపిస్తుంది. ప్రస్తుతం పలు తమిళ క్రేజీ సినిమాలు ఓటిటిలో ప్రదర్శితం కాబోతున్నాయి. వీటి ఫలితం బట్టి ముందుముందు ఇతర సినిమాలు ఓటిటి బాటపట్టే అవకాశం ఉంది. తాజాగా ధనుష్ నటించిన 'జగమే తంత్రం' కూడా డిజిటల్ రిలీజుకు రెడీ అవుతోంది.

యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాఫియా యాక్షన్ డ్రామా.. పాపులర్ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇప్పటికే ట్రైలర్ తో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు 17 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ధనుష్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ సినిమా ఇన్ని భాషల్లో ఇన్ని దేశాల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం. అయితే నిన్నటివరకు ఈ సినిమా జూన్ 18న రిలీజ్ అవుతోంది కానీ ఏ టైంలో రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. కానీ తాజాగా జగమే తంత్రం మేకర్స్ సినిమా స్ట్రీమింగ్ టైం పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 18న మధ్యాహ్నం 12:30 గంటల నుండి డిజిటల్ స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది. చూడాలి మరి ఈ వరల్డ్ మాఫియా డ్రామాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో..!