Begin typing your search above and press return to search.

పవన్ తో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   9 April 2020 8:50 AM GMT
పవన్ తో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. పవన్ చేస్తున్న సినిమాల తాలూకు అప్ డేట్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్ల తర్వాత అడుగు పెట్టి ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించడంతో ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. వాటిలో మొదటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నాడు. 'పింక్' రీమేక్ ఎలాగూ లిమిటెడ్ బడ్జెట్.. అందులోనూ చూసిన కథే కాబట్టి దాని మీద భారీ అంచనాలేమీ లేవనే చెప్పవచ్చు. ఆ తర్వాత తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రంపై భారీ అంచనాలున్నాయు. ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాలో పవన్ కి జోడీగా నటిస్తున్నది సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా మెయిన్ హీరోయిన్ రోల్ జాక్వెలిన్ చేస్తుందంట. ప్రభాస్ 'సాహో' సినిమాలో ఒక సాంగ్ లో మెరిసిన ఈ శ్రీలంకన్ బ్యూటీ అప్పటి నుండి సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పవన్ సినిమా కు సైన్ చేసిందని సమాచారం. ఈ సినిమా యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గా తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫిల్మ్. ఇది కల్పిత కథ అయినప్పటికీ భారతదేశంలో మొఘల్స్ కాలం నాటి సంఘటనల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా మొగల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు కాలం నాటి కోహినూర్ డైమండ్ నేపథ్యంలో కూడా ఉంటుందట. ఈ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నించే పాత్రలో పవన్ కనిపిస్తాడని సమాచారం. జాక్వెలిన్ ఔరంగజేబు సోదరి పాత్రలో నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ తో ఆమెకు మంచి ట్రాక్ కూడా ఉంటుందట. ఈ పాత్ర షూటింగ్ కోసం జాక్వెలిన్ ఏకంగా 40 రోజుల కాల్షీట్స్ కేటాయించిందట. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా వెలువరించనున్నారు.

ఇదిలా ఉండగా జాక్వెలిన్ ప్రస్తుతం జాన్ అబ్రహం నటిస్తున్న 'అటాక్' సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నది. ఈమెతో పాటు రకుల్ ప్రీత్ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం పూర్తయిన తర్వాతే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవన్ కళ్యాణ్ చిత్ర షూటింగ్ లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఏదేమైనా బాలీవుడ్ లో తన సత్తా చూపిన ఈ హాట్ బ్యూటీ సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాతో పాగా వేస్తుందేమో చూడాలి. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన పవన్ - క్రిష్ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ అనుకుంటున్నారు. కరోనా భయాలు తొలగిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనున్నదని సమాచారం.