ఒంటిపై స్నానాల టవల్ నిలవనంటే ఎలా జాకీ?

Fri Jul 23 2021 23:07:55 GMT+0530 (IST)

Jacqueline Leaves A Lot For Imagination With Her Poses in Towel

సాహో బ్యాడ్ గాళ్ గా అభిమానులకు సుపరిచితమైన జాకీ అలియాస్ జాక్విలిన్ ఏం చేసినా సంచలనమే. ఈ లాక్ డౌన్ సీజన్ లో జాకీ పూర్తిగా ఇంటికే అంకితమైంది. ఆ సమయంలో వరుస ఫోటోషూట్లతో అంతర్జాలంలో దుమారం రేపింది. ఒరిజినాలిటీ పేరుతో తన వాస్తవ రూపాన్ని తెరపరిచి ఆశ్చర్యపోయేలా చేసింది.ఇప్పుడు మరోసారి అదే తీరుగా ఒరిజినల్ కాన్సెప్ట్ తో హీట్ పెంచింది. సమాజం ఉన్నప్పుడు మీరు అగ్లీ (అసహ్యం)గా కనిపించరు..! అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చింది జాకీ. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ స్పెషల్ ఫోటోషూట్ కోసం పక్కాగా ప్రిపేరైన తీరు ముచ్చటగొలుపుతోంది. ఒక టవల్ ని తన దేహానికి చుట్టుకుని బాత్రూమ్ లో ఇలా ఫోజులిచ్చింది. 'మీరు అగ్లీ కాదు.. సమాజం ఉంది' అన్న వ్యాఖ్యను జోడించారు. అవాస్తవ సౌందర్య ప్రమాణాల మధ్య సెల్ఫ్ లవ్ గురించి సందేశంతో ఈ కొత్త ఫోటోషూట్ ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

బాత్రూంలో ఫోటోషూట్ లో జాకీ లుక్ అగ్గి రాజేస్తోంది. షైనీ నారింజ రంగు టవల్ ని జాకీ చుట్టుకుంది. మొదటి ఫోటోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కెమెరా వైపు ప్రక్కకు చూస్తుండగా .. రెండవది ఆమె వెనుక నుంచి తీసిన షాట్ హైలైట్. అభిమానులు జాక్వెలిన్ పోస్ట్ పై ప్రేమను చూపించారు చాలామంది 'హాట్'.. 'పూజించదగినది'... 'అందమైన' .. 'మనోహరమైన' వంటి విశేషణాలను ఉపయోగించి పొగిడేశారు. నాకు ఇష్టమైన హాటెస్ట్ గర్ల్ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.

గత సంవత్సరం జాక్వెలిన్ నెట్ ఫ్లిక్స్ చిత్రం `మిసెస్ సీరియల్ కిల్లర్` తో డిజిటల్ అరంగేట్రం చేసింది. ఇందులో మనోజ్ బాజ్ పేయి .. మోహిత్ రైనాతో కలిసి నటించారు. ఆమె ఇటీవల రాపర్ బాద్షాతో కలిసి పానీ పానీ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. తదుపరి పైప్ లైన్ లో భూత్ పోలీస్- సిర్కస్- బచ్చన్ పాండే- రామ్ సేతు- అటాక్ వంటి అనేక చిత్రాలను కలిగి ఉంది.

కోవిడ్ -19 మహమ్మారి తనను వృత్తిపరంగా ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి మాట్లాడుతూ ``ప్రతి ఒక్కరూ ప్రభావితమయ్యారు. నాకు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం చాలా కీలకం. విడుదల చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కాని విడుదల తేదీలు మారబోతున్నాయి. ఏమీ చేయలేని చిక్కులున్నాయి``అని జాకీ అన్నారు.

వైరస్ వ్యాప్తి కారణంగా జాక్వెలిన్ చాలా సినిమాలు ఆలస్యం అయినప్పటికీ ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆమె భావిస్తోంది.  కోవిడ్ -19 కి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ముఖ్యం. మనం కేసులను తగ్గించేలా చూసుకోవాలి. ముఖ్యంగా టీకాలు వేయించండి. మనం వేరే ఏదైనా చేసే ముందు దాన్ని నిజంగా చూడాలి. షూటింగులు మళ్ళీ ప్రారంభించగలిగినప్పుడు కొత్త మార్గాలకు కట్టుబడి ఉన్నామని నిర్ధారించుకోవాలి.. అని జాకీ అన్నారు.