200కోట్ల కుంభకోణంలో ఇద్దరు హాటీల షేర్!

Sun Dec 05 2021 15:00:01 GMT+0530 (IST)

Jacqueline Fernandez received gifts worth 10 crore from conman Sukesh

200 కోట్ల కుంభకోణం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త సుకేష్ చంద్రన్ అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా సుకేష్ తో సంబంధాలు ఉన్నవారందరినీ జల్లెడపట్టి ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా బాలీవుడ్ నుంచి నటి జాక్వెలీన్  ఫెర్నాండేజ్.. నోరా పతేహీ పేర్లు తెరపైకి రావడం అనంతరం ఈడీ విచారణ తెలిసిందే. నోరా పతేహీ ఇప్పటికే విచారణ ఎదుర్కొంది. జాక్వెలిన్ పలు మార్లు విచారణని స్కిప్ట్ కొట్టేందుకు ప్రయత్నించినా చివరిగా తను కూడా ఈడీ విచారణకు హాజరైంది. ఈడీ ఆమె నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.సుకేష్ చంద్రన్ తో  ఎలాంటి సంబంధాలు  లేవని ఈడీ ముందు బుకాయించినా తాజాగా సుకేష్ తో జాక్విలిన్ ఎంతో సన్నిహితంగా మెలిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు షేక్ చేస్తున్నాయి. జాక్వెలీన్ కి సుఖేష్ నుండి ఖరీదైన బహుమతులు అందినట్లు చార్జ్ షీట్ లో అభియోగం మోపారు. 52 లక్షల ఖరీదైన ఇల్లు.. 9 లక్షలు ఖరీదు గల పెర్షియన్ క్యాట్ జాక్వెలీన్ కి  బహుమతులుగా సుకేష్ చంద్రశేఖర్ అందించినట్లుగా ఆరోపించారు.  మొత్తంగా  200 కోట్లలో 10కోట్లు జాక్వెలీన్ ఖాతాకు చేరినట్టేనని విచారణలో వెల్లడైందని కథనాలొస్తున్నాయి.

అలాగే జాక్వెలీన్  సన్నిహితులను కూడా ఈ కేసులో భాగంగా విచారించారు. ఈ లింకులోనే ఐటమ్ గాళ్ నోరా పతేహీని కూడా విచారించగా.. సుకేష్ తనకు కూడా ఒక  కోటి రూపాయల విలువైన కార్ ను బహుమతిగా ఇచ్చినట్లు తేలింది. ఈ అంశాలన్నింటిని  పోలీసులు చార్జ్ షీట్ లో ఫైల్ చేసారు. మొత్తంగా సన్నివేశం చూస్తుంటే 200 కోట్ల కుంభకోణంలో జాక్వెలీన్ ...నోరాపతేహీలు లాక్ అయినట్టే కనిపిస్తోందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సుకేష్ కి  జాక్వెలీన్ ఘాటైన హగ్ ఇచ్చి ముద్దులు పెడుతున్నో పోటోలు ఇప్పుడు  నెట్టింట వైరల్ గా మారాయి.