ఫొటోటాక్ : బెడ్ పై అందాల ఆరబోతతో మత్తెక్తిస్తున్న ముద్దుగుమ్మ

Wed Oct 28 2020 20:00:43 GMT+0530 (IST)

PhotoTalk: An intoxicating kisser with a beauty pageant on the bed

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ అమ్మడు హీరోయన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో మరియు వెబ్ సిరీస్ లతో కూడా అలరిస్తూ ఉంది. ఈ అమ్మడు చేసిన చేస్తున్న పాత్రలతో రోజు రోజుకు పాపులారిటీ దక్కించుకుంటూనే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బెడ్ రూం స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు సినిమాల్లో నటించడంతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ సినీ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఈమెను పవన్ కళ్యాణ్ తో క్రిష్ తెరకెక్కించబోతున్న విరూపాక్ష సినిమా కోసం సంప్రదించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. డిసెంబర్ లేదా జనవరిలో విరూపాక్ష షూటింగ్ ప్రారంభం అయితే అప్పుడు ఈమె తెలుగు సినిమాలో నటించనుందా లేదా అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.