సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ తో 175 కోట్ల విల్లాలో సహజీవనం?

Thu Jun 17 2021 11:00:45 GMT+0530 (IST)

Jacqueline Fernandez To Move Into Rs 175 Cr House

బాలీవుడ్ లో సహజీవనం అనే కాన్సెప్ట్ చాలా ఓల్డ్. అది రంగుల ప్రపంచంలో చాలా సహజం. ఇంతకుముందు దర్శకులతో సహజీవనం చేసిన పలువురు కథానాయికల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలొచ్చాయి. తాజాగా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రముఖ దర్శకుడితో సహజీవనం చేస్తోందని..తన సీక్రెట్ బాయ్ఫ్రెండ్ తో కలిసి ముంబైలో రూ.175 కోట్ల విలువ చేసే సీఫేసింగ్ జుహు బంగ్లాలో సహజీవనం చేయనుందని కథనాలొస్తున్నాయి.జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరిసారిగా `మిసెస్` అనే చిత్రంలో కనిపించింది. ఇందులో సీరియల్ కిల్లర్ పాత్రలో నటించింది. ఆ తర్వాత కొద్దిరోజులుగా తన సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ గురించిన గుసగుసలు మొదలయ్యాయి. శ్రీలంకన్ బ్యూటీ జాకీ తన ఐడియల్ మ్యాన్ ని కనుగొందని ఊహాగానాలు చెలరేగాయి.

ప్రఖ్యాత బొంబాయి టైమ్స్ కథనం ప్రకారం.. జాక్వెలిన్ ఒక ప్రముఖ దక్షిణాది పారిశ్రామికవేత్తను ప్రేమిస్తోందని.. ఈ జంట కొత్తగా కొనుగోలు చేసిన జుహు ఇంట్లో కలిసి నివశించాలని యోచిస్తున్నట్లు సదరు కథనం వెల్లడించింది. జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి తమ డ్రీమ్ హౌస్ ను రూ .175 కోట్లకు కొనుగోలు చేసినట్లు కథనాలొచ్చాయి.  ముంబైలో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లా కొనడానికి ఇద్దరూ రాజీ అన్నదే లేకుండా ఖర్చు చేశారని తెలిసింది. గత రెండు నెలలుగా ఇంటి వేటలో బిజీగా ఉన్న జాకీ ప్రస్తుతం తన కొత్త నివాసానికి ఇంటీరియర్స్ చేయడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్ ను కూడా ఖరారు చేసిందని దినపత్రిక వెల్లడించింది.

జాక్వెలిన్ నిండా ప్రేమలో ఉంది. జుహులో ఉన్న తమ ఇంటి గురించి చర్చించడానికి ప్రియుడితో వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అవుతోందిట. ఇంతకీ తన సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ ఎవరు? అన్న సందేహం వస్తే.. అతడు ప్రముఖ దర్శకుడు.. వ్యాపారవేత్త అయిన సాజిద్ ఖాన్ అంటూ లోగుట్టుపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011 లో హౌస్ ఫుల్ 2 చిత్రీకరణ సమయంలో దర్శకుడు సాజిద్ ఖాన్ తో జాకీ డేటింగ్ చేసింది. అయితే ఈ జంట 2013 లో బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత బహ్రెయిన్ యువరాజు హసన్ బిన్ రషీద్ అల్ ఖలీఫాతో జాక్విలన్ ప్రేమలో పడిందని కథనాలొచ్చాయి. అయితే జాక్విలిన్ బోయ్ ఫ్రెండ్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.

కెరీర్ పరంగా చూస్తే.. అక్షయ్ కుమార్ తో కలిసి `రామ్ సేతు`..బచ్చన్ పాండే చిత్రాల్లో స్క్రీన్ స్పేస్ పంచుకుంటోంది. వీరిద్దరూ ఇంతకు ముందు హౌస్ఫుల్ 2-హౌస్ఫుల్ 3- బ్రదర్స్ చిత్రాల్లో నటించారు. రోహిత్ శెట్టి సర్కస్.. జాన్ అబ్రహాంతో ఎటాక్ ..భూత్ పోలీస్ వంటి చిత్రాల్లోనూ జాకీ నటిస్తోంది.