సాహో బ్యాడ్ గాళ్ రెడ్ హాట్ లుక్

Sat Jul 02 2022 06:00:01 GMT+0530 (IST)

Jacqueline Fernandez Red Hot Look

సాహో బ్యాడ్ గాళ్ గా తెలుగు లోగిళ్లకు పరిచయమైన బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ భామ ట్రెండీ లుక్స్ కి యువతరంలో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల కాన్ మన్ సుఖేష్ చంద్రతో ఎఫైర్ వ్యవహారంలో జాక్విలిన్ పేరు హెడ్ లైన్స్ లోకి వచ్చింది.మరోవైపు నిరంతరం రెడ్ కార్పెట్ లుక్స్ తో ఈ బ్యూటీ కిల్ చేస్తూనే ఉంది. ప్రఖ్యాత బ్రాండ్లను తన ఖాతాలో వేసుకుంటూ భారీగా ఆర్జిస్తోంది.  ఇప్పుడు ఆజియో బ్రాండ్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఈ బ్రాండ్ కి ప్రమోట్ చేస్తూ ఇదిగో ఇలా రెడ్ హాట్ లుక్స్ తో చెలరేగిపోయింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెడ్ లెదర్ స్లిట్ గౌనులో ధగధగా మెరిసిపోతోంది. అందమైన స్టైలిష్ అవతార్ తో మెరుపులు మెరిపించింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం హిందీ వినోద పరిశ్రమలో క్రేజ్ ఉన్న హీరోయిన. దశాబ్ధం పైగా కెరీర్ ని విజయవంతంగా రన్  చేసిన జాక్వెలిన్ అత్యంత ఆకర్షణ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. యూనిక్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ వేడి పెంచడం ఈ భామ ప్రత్యేకత. అలాగే స్పెషల్ మ్యూజిక్ వీడియోలలోను కనిపించింది. వోగ్.. పీకాక్ సహా ప్రఖ్యాత  మ్యాగజైన్ కవర్ పేజీలపైనా నిరంతరం కనిపిస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో జాకీ ఎప్పుడూ ముందుంటోంది.

తాజాగా రెడ్ హాట్ లెదర్ స్లిట్ గౌనులో జాకీ హొయలకు సంబంధించిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అలాగే ఫోటోషూట్ కూడా వాట్సాప లలో వైరల్ గా మారుతోంది. జాకీ  నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.వివాదాలు ఉన్నా క్రేజ్ తగ్గలేదు!

జాక్విలిన్ పేరు ఇటీవల వివాదాస్పద అంశాలతో హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పదుడు అయిన కాన్ మన్ సుఖేష్ చంద్రతో జాక్విలిన్ సంబంధాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కోట్లాది రూపాయల దందా కేసులో సుఖేష్ ని విచారించగా అతడితో జాకీ ఎఫైర్ వ్యవహారం బయటపడింది. అనంతరం సుఖేష్ కానుకగా అందించిన కార్ ని డబ్బుని జాకీ నుంచి ఈడీ తిరిగి లాక్కుంది. ఇక జాకీలో దయా గుణం దానగుణం గురించి కూడా మరో కోణంలో చర్చ సాగింది.

స్వతహాగా శ్రీలంకన్ బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిసారీ శ్రీలంకలో అల్లకల్లోల పరిస్థితులపై ఆవేదన చెందుతూనే ఉంది. తన మాతృభూమిలో ఇటీవలి సంక్షోభ పరిస్థితి గురించి తల్లడిల్లిపోయింది. తిండి తిప్పల్లేక శ్రీలంకన్ ప్రజలు అల్లాడిపోతుంటే గుండె పగిలిపోయిందని వ్యాఖ్యానించింది. శ్రీలంకన్ గా నా దేశం నా దేశప్రజలు ఎలాంటి కష్టం అనుభవిస్తున్నారో చూడటం చాలా హృదయ విదారకంగా ఉందని జాక్వెలిన్ ఆవేదన చెందింది. ఎవరో ఒకరిని దూషించకుండా పరిస్థితిని దారికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. దేశ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తానని తెలిపింది.

జాక్వెలిన్ శ్రీలంక మిస్ యూనివర్స్ గా కిరీటాన్ని గెలుపొంది పదిహేను సంవత్సరాలైంది. 2006లో కిరీటం గెలుచుకుంది. కిరీటం గెలిచిన మూడు సంవత్సరాల తరువాత అంటే 2009లో సినీఎంట్రీ ఇచ్చింది. రితేష్ దేశ్ ముఖ్ 'అలాదిన్' తో జాకీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్  కిక్ తో జాక్వెలిన్ స్టార్ డమ్ ఎదిగింది. ఆమె చివరిసారిగా జాన్ అబ్రహం ఎటాక్ లో కనిపించింది. ఇంతకుముందు ప్రభాస్ సాహోలో స్పెషల్ నంబర్ తో అదరగొట్టి బ్యాడ్ గాళ్ గా తెలుగునాటా పాపులరైంది. హరిహర వీరమల్లులో నటించాల్సి ఉండగా వివాదాల కారణంగా మూవీ నుంచి వైదొలిగిందని కథనాలొచ్చాయి.