Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జాకీ అందాల విందు ప‌సందు

By:  Tupaki Desk   |   4 March 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: జాకీ అందాల విందు ప‌సందు
X
సాహో చిత్రంలో బ్యాడ్ బోయ్ సాంగ్ తో తెలుగు నాటా సుప‌రిచిత‌మైపోయింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న ఓ మూవీలో న‌టిస్తోంద‌న్న ప్ర‌చారం ఉంది. అలాగే బాలీవుడ్ లో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. ప్ర‌స్తుతం అక్షయ్ కుమార్ స‌ర‌స‌న‌ బచ్చన్ పాండే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ మూవీ సెట్స్ నుండి తాజాగా ఓ లైవ్ ఫోటోని జాకీ షేర్ చేసింది.

బ‌చ్చ‌న్ పాండేతో ఫుల్ బిజీగా ఉన్నాన‌ని జాక్వెలిన్ ఈ సంద‌ర్భంగా తెలిపింది. సెట్లో ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ‌ని కొన్ని స్పెష‌ల్ ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోలో జాకీ సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంది. అలా చేతి మునివేళ్ల‌ను నోట్లో పెట్టుకుని ఏదో సీరియ‌స్ గానే థింక్ చేస్తున్న‌ట్టుగా అనిపిస్తోంది. అనాలోచితంగా ఉన్నా.. ఆ వైట్ డిజైన‌ర్ టాప్ లో జాకీ అందాల విందు యూత్ కి ప‌సందు అనే చెప్పాలి. అంత తీక్ష‌ణంగా ఆలోచించాల్సిన మ్యాట‌ర్ ఏం ఉందో కానీ...! అంటూ బోయ్స్ ఒక‌టే న‌సిగేస్తున్నారు! తాజా చిత్రంలో అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం ఇచ్చినందుకు జాకీ టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

గతంలోనూ జాక్విలిన్ అక్ష‌య్ కుమార్ ‌తో కలిసి 2015 యాక్ష‌న్ డ్రామా `బ్రదర్స్` లో న‌టించింది. అలాగే హౌస్‌ఫుల్ 3 లోనూ క‌లిసి న‌టించింది. హౌస్‌ఫుల్ 4 దర్శకుడు ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న బ‌చ్చ‌న్ పాండే లో కృతి సనోన్ - అర్షద్ వార్సీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రం 26 జనవరి 2022 న థియేటర్లలోకి రానుంది. ఇందులో అక్ష‌య్ కుమార్ న‌టుడ‌వ్వాల‌ని త‌పించే గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్నాడు.

ఫెర్నాండెజ్ 2009 లో అల్లాడిన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హౌస్‌ఫుల్ (2010)- మర్డర్ 2 (2011)-డిష్యూమ్-జుడ్వా 2 (2017)-బ్రదర్స్ వంటి చిత్రాలలో నటించింది. కిక్ - రేస్ 3లోనూ జాకీ న‌టించింది. ప్రస్తుతం వ‌రుస‌ చిత్రాలతో బిజీగా ఉంది. బచ్చన్ పాండే కాకుండా జాన్ అబ్రహం అటాక్ లో న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్న‌ హర్రర్-కామెడీ భూత్ పోలీస్ లో చేస్తోంది. రోహిత్ శెట్టి సర్కస్..లోనూ న‌టిస్తోంది.