Begin typing your search above and press return to search.

పిక్ టాక్: వింటర్ లో హీట్ పెంచేస్తున్న 'సాహో' బ్యూటీ..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 2:30 AM GMT
పిక్ టాక్: వింటర్ లో హీట్ పెంచేస్తున్న సాహో బ్యూటీ..!
X
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో అదరగొడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో కుర్రకారు మతిపోగుడుతోన్న ఈ బ్యూటీ.. హీరోయిన్‌ గానే కాకుండా ఐటమ్‌ సాంగ్స్‌ తోనూ అలరిస్తోంది. హిట్టు - ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ హీట్ పెంచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జాక్వాలిన్ లేటెస్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో వింటర్ లో కూడా సమ్మర్ హీట్ ని కలిగించేలా ఉంది. కేవలం టాప్ కనిపించేలా అమ్మడు కూర్చొని ఉన్న పోజ్ చూస్తే సెగలు పుట్టాల్సిందే. దీనికి జాక్ 'చాలా చాలా దూరం' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీనికి నెటిజన్స్ లైకులు కొట్టడంతో పాటు షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు. కాగా, 'అలాడిన్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాక్వెలిన్.. 'మర్డర్ 2' 'హౌస్ ఫుల్ 2' 'రేస్ 2' 'రేస్ 3' 'కిక్' 'రాయ్' 'బ్రదర్స్' 'హౌస్ ఫుల్ 3' 'జుద్వా 2' 'డ్రైవ్' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘సాహో’లో డార్లింగ్ ప్రభాస్‌ పక్కన 'బ్యాడ్ బాయ్' అంటూ చిందులేసి సౌత్ ఆడియన్స్ ని కూడా అలరించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న జాక్వెలిన్.. ప్రస్తుతం జాన్ అబ్రహం - రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి 'ఎటాక్'లో నటిస్తోంది. అలానే సైఫ్ అలీ ఖాన్ - అర్జున్ కపూర్ - యామీ గౌతమ్ కలిసి నటిస్తున్న 'బూత్ పోలీస్' సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది.