Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న జాక్విలిన్ కిరాక్ లుక్

By:  Tupaki Desk   |   25 Nov 2020 9:30 AM GMT
ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న జాక్విలిన్ కిరాక్ లుక్
X
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో అభిమానులకు స‌ర్ ప్రైజ్ ట్రీట్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే సంథింగ్ స్పెష‌ల్ అనిపించే ఫోటోషూట్ తో ఈ అమ్మ‌డు అభిమానుల ముందుకొచ్చింది. జాక్విలిన్ తాజా ఫోటోలు చూస్తే మంగళవారం నాడు థండర్ మూడ్ ‌లో ఉన్నట్టే క‌నిపిస్తోంది.

జాక్విలిన్ తాజా ఇన్ ‌స్టాగ్రామ్ పిక్చర్ మోనోక్రోమ్ ఫ్రేమ్ ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఓపెన్ జాకెట్ ‌ఫోజుతో కెమెరా కోసం ప్ర‌త్యేక‌ భంగిమల్ని ప్ర‌ద‌ర్శించింది. ఆ నీలిరంగు డెనిమ్... ఓపెన్ హెయిర్ తో తన సున్నితమైన రూపాన్ని ఆక‌ర్ష‌ణీయంగా ఎలివేట్ చే‌సింది. పూర్తి చేస్తుంది. ఈ ఫోటో కి ఇన్ స్టా‌లో ప్రస్తుతం 543 కె లైక్ లు ద‌క్కాయి.

జాక్వెలిన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం భూత్ పోలీస్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇందులో యామి గౌతమ్- సైఫ్ అలీ ఖాన్- అర్జున్ కపూర్ కూడా నటించారు. ఈ చిత్రం హిమాచల్ ప్రదేశ్ లో హిల్ స్టేషన్ల మీదుగా డల్ హౌసీ ధర్మశాలల్లో చిత్రీకరిస్తున్నారు.

రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన సిర్కస్ చిత్రీకరణను ఆమె త్వరలో ప్రారంభించనుంది.