ఫోటో స్టొరీ: పర్ఫెక్ట్ బ్యాడ్ గర్ల్

Sat Aug 24 2019 20:36:12 GMT+0530 (IST)

Jacqueline Fernandez In Saaho Movie

డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఆగష్టు 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ కూడా చివరి దశకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా మారిపోయాయి.  ముఖ్యంగా ఈ సినిమాలోని 'బ్యాడ్ బాయ్' సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతోంది.ర్యాపర్ బాద్షా ఈ పాటకు బాణీ అందించడమే కాకుండా నీతి మోహన్ తో కలిసి ఈ పాటను పాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట స్పెషాలిటీ అదొక్కటే కాదు.  ఈ పాటలో హైలైట్ శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్.  ప్రభాస్ తో పోటీగా స్టెప్పులు వేయడమే కాకుండా మినీలు మైక్రోలు ధరించి 'ఐ కెన్ బి యువర్ బ్యాడ్ గర్ల్' అంటూ గ్లామర్ ను ఫుల్ గా ఒలికించింది.  ఈ పాటకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి జాక్వెలిన్ గ్లామర్ ట్రీట్ కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఈ పాట ఒక దశలో #నంబర్ 1 స్థానం లో ట్రెండింగ్ అయింది. లాప్ టాపులలో.. ఫోన్లలో చూస్తేనే ఈ పాట విజిల్స్ వేసేలా ఉంటే థియేటర్లలో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.  

యూవీవారు సుజిత్ కలిసి మన డార్లింగ్ కోసం ఓ పర్ఫెక్ట్ బ్యాడ్ గర్ల్ ను వెతికి మరీ పట్టుకొచ్చారు.   ఈ పాట సూపర్ హిట్ అయింది కాబట్టి ఇక మిగతా టాలీవుడ్ స్టార్ల దృష్టి ఈ భామపై పడుతుందనడంలో సందేహం లేదు.  పైనుండే ఫోటోలో ఒక మేలు జాతి గుర్రంతో కలిసి ఒక కిరాక్ పోజిచ్చింది కదా.. అది బ్యాడ్ బాయ్ పాటలోని ఒక స్టిల్.   ఎంతైనా ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.. ఆ రేంజే వేరు!