ఫోటో స్టొరీ: బ్లాక్ లో బ్యాడ్ గర్ల్!

Mon Sep 16 2019 23:01:15 GMT+0530 (IST)

Jacqueline Fernandez Glamourous Pose

బాలీవుడ్ లో ఉన్న చాలామంది ఇంటర్నేషనల్ బ్యూటీలలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.  శ్రీలంక భామ అయిన ఈ  జాక్వెలిన్ మోడలింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా స్థిరపడింది.  ఈమధ్య 'సాహో' లో బ్యాడ్ బాయ్ పాటలో చిట్టిపొట్టి నిక్కర్లు ధరించి కత్తిలాంటి స్టెప్పులేసి జనాలను క్లీన్ బౌల్డ్ చేసింది. సాహోలో ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ భామ సోషల్ మీడియాలో వెరీవెరీ యాక్టివ్.  ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 32 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే మనం ఈ భామ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఆ ఫాలోయర్ల కోసమే తరచుగా ఏదో ఒక హాట్ అప్డేట్ ఇస్తూ ఉంటుంది.  తాజాగా మరో ఫోటో పోస్ట్ చేసింది  ఈ ఫోటోకు "నా కొత్త వ్లాగ్ వచ్చింది.. చూస్తూ ఉండండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వ్లాగ్ అంటే తెలుసు కదా.. వీడియో బ్లాగ్ లేదా వీడియో లాగ్.  పర్సనల్ వెబ్ సైట్ లో లేదా సోషల్ మీడియాలో పర్సనల్ వీడియోస్ పోస్ట్ చేయడం.  మరి ఆ వ్లాగ్ కు ఎక్కడ పోస్ట్ చేసిందనే వివరాలు ఇవ్వలేదు.  ఇక ఫోటో విషయానికి వస్తే నీటిపై ప్రయాణిస్తున్న బోటుపై బ్లాక్ డ్రెస్ ధరించి చాటకు రెండు రెట్ల సైజులో ఉండే ఒక హ్యాటు ను ఒడిలో పెట్టుకుని మోడరన్ ఎంకి లా కూర్చుంది. నో యాక్సెసరీస్.. తలపై కొప్పుతో భలే ఉంది.   అసలే చిట్టిపొట్టి డ్రెస్ కావడంతో హాట్ నెస్ ను పోతపోసినట్టుగా ఉంది.  

శ్రీలంక పాప పోస్ట్ చేసిన ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయ్యారు.  ఫోటో పోస్ట్ చేసిన 10 గంటల్లోనే 1.5 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి.   "సెక్సీ శ్రీలంక బ్యూటీ".. "బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్".. "జాక్వెలిన్ స్టైల్ రాక్స్".. "సెక్సియస్ట్ బాలీవుడ్ బ్యూటీ" అంటూ పొగడ్తలు కురిపించారు.  ఇక జాక్వెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న 'డ్రైవ్' లో హీరోయిన్ గా నటిస్తోంది.