స్టార్ హీరోయిన్ సిస్టర్ కలకలం

Tue Mar 26 2019 15:13:26 GMT+0530 (IST)

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతారు. అంతమంది ఒకేసారి ఒకరికొకరు ఎదురుపడడం కుదరకపోయినా ఏదో ఒక సందర్భంలో ఫలానా వ్యక్తి అచ్చం నీలానే ఉన్నాడు! అంటూ చెప్పేవాళ్లు కనిపిస్తుంటారు. ఐశ్వర్యారాయ్ ని పోలిన స్నేహా ఉల్లాల్ కత్రినను పోలిన జరైన్ ఖాన్ వంటి వాళ్లను చూశాం. ఇటీవల పలువురు స్టార్లు తమను పోలి ఉన్న వేరొకరిని సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదే తీరుగా సరిగ్గా ఏడాది కిందట శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ కి ఓ అమ్మడు పరిచయం అయ్యింది. అచ్చం తనలానే ఉన్న ఆ అమ్మడు ముఖ కవలికలు ఆహార్యం చూసి జాక్విలిన్ ఆశ్చర్యపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత ఆ అమ్మడిని జాకీ మరోసారి గుర్తు చేసుకుంది. తనతో కలిసి దిగిన ఫోటోని అభిమానులకు షేర్ చేసింది. ఇంతకీ ఎవరీ అమ్మడు? అంటే యూట్యూబ్ సెన్సేషన్ గా చెబుతున్న అమండ సెర్ని. గత ఏడాది సరిగ్గా ఇదే సీజన్ లో ఆ ఇద్దరూ ముంబైలో కలుసుకున్నారు. ఆ సంగతిని మర్చిపోకుండా ఇప్పటికీ గుర్తు పెట్టుకుంది జాకీ. అంతేకాదు అమండాను బాలీవుడ్ కి రావాల్సిందిగా జాకీ అప్పటి నుంచి అడుగుతూనే ఉందట.

ఏడాది కిందటి విషయాన్ని గుర్తు చేసుకుంది. అలాగే తనను బాలీవుడ్ కి పరిచయం చేస్తానని అంటోంది. అయితే బాలీవుడ్ లాంటి చోట కొత్తమ్మాయిలు ఎదగాలంటే ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలి. కెరీర్ పరంగా ఈదలేక ఆత్మహత్య చేసుకోవాలన్నంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయినా జాక్విలిన్ ని కష్టకాలంలో ఆదుకున్నది భాయ్ సల్మాన్ ఖాన్. తనకు అండగా నిలిచి అరడజను అవకాశాలిప్పించిన గొప్ప మనసు భాయ్ ది. అందుకే తన సిస్టర్ ని భాయ్ కి పరిచయం చేస్తుందా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ సెన్సేషన్ గా.. సోషల్ మీడియా సెన్సేషన్ గా పాపులరైన అమండాలో కథానాయిక అయ్యే ఫీచర్స్ ఉన్నాయి. జాక్విలిన్ పోలికలు సన్నిలియోన్ ఎక్స్ ప్రెషను ఉంది కాబట్టి అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ దర్శనిర్మాతలు కాస్తంత అటు చూపు ప్రసరిస్తారేమో చూడాలి.