'అటాక్' పనులు పూర్తి చేసిన హాట్ బ్యూటీ

Sun Aug 01 2021 19:14:46 GMT+0530 (IST)

Jacqueline Completes Attack Movie Works

ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎంతో మంది విదేశీ ముద్దుగుమ్మలు సందడి చేశారు. కాని అందరిలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చాలా స్పెషల్ అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు అంటూ ఉంటారు. శ్రీలంక బ్యూటీ అయిన ఈ అమ్మడు హిందీలో పలు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. సౌత్ లో కూడా ఈమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక సౌత్ స్టార్ తో ప్రేమలో ఉందనే వార్తలు కూడా గత కొంత కాలంగా వస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కకు పెడితే ప్రస్తుతం ఈ అమ్మడి నుండి క్రేజీ అప్ డేట్ వచ్చింది.బాలీవుడ్ ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అటాక్ మూవీకి సంబంధించి ఈమె డబ్బింగ్ కార్యక్రమాలు ముగించింది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లుగా సోషల్ మీడియా లో ఈ పోస్ట్ ను షేర్ చేసింది. జాన్ అబ్రహం హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆమె పాత్ర అత్యంత ప్రత్యేకంగా కనిపించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అంటున్నారు. పాత్రకు తగ్గట్లుగా ఆమె అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది అంటూ ఇప్పటియే బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తాజాగా సినిమా కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా ముగియడంతో ఆగస్టు 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఖాయం అన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. భారీ అంచనాలున్న అటాక్ సినిమాను సౌత్ ఇండియాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ లంక బ్యూటీ త్వరలో తెలుగు లో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా పలు సౌత్ సినిమాల్లో కూడా ఈమె నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.