Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు తెర‌వండి అంటూ ప్ర‌భుత్వాల్ని క‌డిగేసిన డైరెక్ట‌ర్

By:  Tupaki Desk   |   29 Sep 2020 9:50 AM GMT
థియేట‌ర్లు తెర‌వండి అంటూ ప్ర‌భుత్వాల్ని క‌డిగేసిన డైరెక్ట‌ర్
X
`మ‌హాన‌టి` చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డుల్ని ద‌క్కించుకున్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. సోష‌ల్ మీడియా వేదిక‌గా సామాజిక స‌మ‌స్య‌ల పై అగ్రెసీవ్ ‌గా స్పందించే ఈ యువ ద‌ర్శ‌కుడు థియేట‌ర్స్ రీ ఓపెన్ విష‌యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ఆన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా బార్ లు ప‌నిచేయ‌డానికి అనుమ‌తినిచ్చిన‌ప్పుడు సినిమా హాళ్ల‌ని ఎందుకు ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న ప్ర‌భుత్వాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఇంకా క‌రోనా విళ‌య తాండ‌వం చేస్తూనే వుంది. అయినా దాదాపు అన్ని వ్యాపారాల్ని తెరుచుకోవ‌చ్చ‌ని అనుమ‌తులు ఇచ్చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. సినిమా థియేట‌ర్ల‌ని కూడా రీఓపెన్ చేయాల్సిందే అంటూ నాగ్ అశ్విన్ కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

సినిమాని థియేట‌ర్ల‌లో చూడాల‌ని ఓటీటీల్లో కాద‌ని నాగ్ అశ్విన్ అన్నారు. `అంద‌రి భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తాను. అయితే మ‌రి జిమ్ ‌లు.. బార్ ‌లు.. మాల్స్ .. దేవాల‌యాలు.. బ‌స్సు.. రైలు- విమాన స‌ర్వీసుల్ని మొద‌లుపెట్టారు. అలాంట‌ప్పుడు థియేట‌ర్లు రీఓపెన్ చేయాల్సిందే అన్నారు. థియేట‌ర్ల‌ని తెరిచే స‌మ‌యం వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు. థియేట‌ర్లో మాస్క్ ధ‌రించి సినిమా చూడాల‌ని ఎదురుచూస్తున్నాన‌ని అక్క‌డ ఫాస్ట్ ఫార్వ‌డ్ .., పాజ్ అంటూ ఏమీ వుండ‌వ‌ని ట్వీట్ చేశారు.